నా ఆలోచనలే ‘ఇండియన్‌-2’ మూలకథ

ABN, Publish Date - Jul 15 , 2024 | 10:29 PM

గతంలో పలు సందర్భాల్లో తాను వ్యక్తం చేసిన అభిప్రాయాలు, ఆలోచనలే ‘ఇండియన్‌-2’ మూలకథ అని నామ్‌ తమిళర్‌ కట్చి కన్వీనర్‌, సినీ దర్శకుడు సీమాన్ అన్నారు.

indian2

గతంలో పలు సందర్భాల్లో తాను వ్యక్తం చేసిన అభిప్రాయాలు, ఆలోచనలే ‘ఇండియన్‌-2’ (indian2) మూలకథ అని నామ్‌ తమిళర్‌ కట్చి కన్వీనర్‌, సినీ దర్శకుడు సీమాన్ (Seeman) అన్నారు. శంకర్ (Shankar Shanmugham) దర్శకత్వంలో విశ్వనటుడు కమల్‌ హీరోగా నటించిన ‘ఇండియన్‌-2’ చిత్రం శుక్రవారం ప్రచంపవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదలైంది. ఈ సినిమా తమిళ వెర్షన్‌ను నగరంలోని సత్యం థియేటర్‌లో హీరో కమలహాసన్ (Kamal Haasan) తో కలిసి సీమాన్‌ వీక్షించారు.

ఆ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ...‘ఈ సినిమా తొలి భాగంలో సేనాపతి తాత వచ్చి సమాజంలోని సమస్యలను పరిష్కరిస్తాడు. రెండో భాగంలో నీ సమస్యలను నువ్వే పరిష్కరించుకోవాలి. ప్రతి ఒక్కరూ తమ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటే దేశం పరిశుభ్రంగా ఉంటుందని చెప్పారు. లంచం, అవినీతి ఇష్టంలేకుంటే ధైర్యంగా వ్యతిరేకించాలి. ఇండియన్‌ తాత, శ్రీకృష్ణుడు, మహ్మద్‌ ప్రవక్త, ఏసుక్రీస్తు వంటి వారు వచ్చి అన్యాయాన్ని తట్టిలేపుతారని ఎదురు చూసేబదులు మీరే సమస్యను పరిష్కరించుకోవాలి.


ఈ సినిమా కథాంశం కొన్నాళ్ళుగా బయట ప్రపంచంలో నేను మాట్లాడుతున్న అంశమే. అందుకే కమల్‌ హాసన్‌ (Kamal Haasan) ఫోన్‌ చేసి ఈ సినిమా చూడమన్నారు. గతంలో నేను మాట్లాడిన వ్యాఖ్యలు మొత్తం ఈ సినిమాలో ఉన్నాయి. ఆ తర్వాత ‘ఇండియన్‌-3’లో ఉంటాయి. ఒక మంచి సందేశంతో సినిమాను తెరకెక్కించిన దర్శక హీరోలకు అభినందనలు’ అని పేర్కొన్నారు.

Updated Date - Jul 15 , 2024 | 10:29 PM