Vijay Milton: సినిమాల్లో విలన్ చావడం.. చెడు సంప్రదాయం
ABN, Publish Date - May 31 , 2024 | 03:51 PM
సినిమాల్లో ప్రతి నాయకుడు చనిపోకూడదని దర్శకుడు విజయ్ మిల్టన్ అన్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ‘మళై పిడిక్కాద మణిదన్’ తెలుగులో తుఫాన్ పేరుతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. విజయ్ ఆంటోనీ, శరత్ కుమార్స, త్యరాజ్ ప్రధాన పాత్రలు పోషించారు.
ప్రతి సినిమాల్లో విలన్‌ను చంపేస్తుంటారని, సినిమాల్లో ప్రతి నాయకుడు అనేవాడు చనిపోకూడదని దర్శకుడు విజయ్ మిల్టన్ (Vijay Milton) అన్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ‘మళై పిడిక్కాద మణిదన్’(Mazhai Pidikkatha Manithan ) తెలుగులో తుఫాన్ (Toofan) పేరుతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. విజయ్ ఆంటోనీ హీరో (Vijay Antony), మేఘా ఆకాష్ (Megha Akash) హీరోయిన్. శరత్ కుమార్ (Sarathkumar), సత్యరాజ్ (Sathyaraj) తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఆడియో, ట్రైలర్ తాజాగా రిలీజ్ చేశారు.
ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాతలు ధనుంజయన్ (Daali Dhananjaya), నటి మేఘా ఆకాష్, నటుడు సత్యరాజ్, హీరో విజయ్ ఆంటోనీ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు విజయ్ మిల్టన్ మాట్లాడుతూ, ‘ఇది ఒక యాక్షన్ చిత్రమే కాదు. ఇది పొయెటిక్ యాక్షన్ జానర్. ఈ మాట నేను చెప్పడం లేదు. నిర్మాత ధనుంజయన్ అంటున్నారు.
నా చిత్రాల్లో విలన్ చావకూడదు. చంపేయడమే చెడు సంప్రదయామన అన్నారు. సత్యరాజ్ వంటి టాలెంటెడ్ నటుడిని నేను ఇప్పటి వరకు చూడలేదని, శరత్ కుమార్‌లో మంచి నాయకత్వ లక్షణాలున్నాయని.. ఆయన సూర్యవంశం సినిమా నుంచి బాగా తెలుసని కథ విన్న వెంటనే నటించేందుకు ఓకే చెప్పారన్నారు. మేఘా ఆకాష్, టెక్నికల్ టీం ఎంతగానో సహకరించారు’ అన్నారు.
విజయ్ ఆంటోనీ (Vijay Antony) మాట్లాడుతూ.. ‘విజయ్ మిల్టన్ ఈ చిత్రాన్ని పూర్తి చేసేందుకు చాలా కష్టాలు పడ్డాడని... కరోనా వంటి మహమ్మారిలను అధిగమించి శ్రమించారన్నారు. సత్యరాజ్, మేఘా ఆకాష్, శరత్ కుమార్ ఇలా అనేక మందితో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని ఈ చిత్రం పెద్ద హిట్ అయి నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టాలని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు. ఆ తర్వాత నటుడు సత్యరాజ్, హీరోయిన్ మేఘా ఆకాష్, సంగీత దర్శకుడు అచ్చు రాజామణి తదితరులు ప్రసంగించారు.