Darshan Case: దర్శన్ భార్య కమిషనర్ కి ఏం చెప్పిందంటే
ABN, Publish Date - Jul 05 , 2024 | 07:25 PM
రేణుకాస్వామి (Renuka Swami) హత్య కేసులో నిందితుడిగా హీరో దర్శన్ అతని ప్రేయసి పవిత్రా గౌడ ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే! అయితే, విచారణ క్రమంలో పోలీసులు వీరిద్దరినీ దంపతులుగా పేర్కొనడంపై దర్శన్ భార్య విజయలక్ష్మి అభ్యంతరం వ్యక్తంచేశారు.
రేణుకాస్వామి (Renuka Swami) హత్య కేసులో నిందితుడిగా హీరో దర్శన్ అతని ప్రేయసి పవిత్రా గౌడ ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే! అయితే, విచారణ క్రమంలో పోలీసులు వీరిద్దరినీ దంపతులుగా పేర్కొనడంపై దర్శన్ భార్య విజయలక్ష్మి అభ్యంతరం వ్యక్తంచేశారు. ఆమె నటుడి భార్య కాదంటూ బెంగళూరు పోలీసు కమిషనర్ బి.దయానందకు తాజాగా లేఖ రాశారు దర్శన భార్య.
‘‘ఇటీవల దర్శన్ భార్య విజయలక్ష్మీ ఓ ప్రకటన చేశారు. ఆ తర్వాత కూడా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ కర్ణాటక హెంమంత్రి నటుడి దంపతులు అరెస్ట్ అయ్యరని అన్నారు. ఆమె దర్శన్ భార్య కాదు. కేవలం నా భర్తకు స్నేహితురాలు మాత్రమే. దర్శన్‌కు చట్టపరమైన జీవిత భాగస్వామిని నేను ఒక్కదాన్ని మాత్రమే. 2003లో మా పెళ్లి జరిగింది. పోలీసు రికార్డుల్లోనూ మీరు ఆమె పేరును దర్శన్ సతీమణిగా పేర్కొనవద్దు. అది భవిష్యత్తులో నాకు, నా కుమారుడికి సమస్యలు తీసుకొస్తుంది. పవిత్రకు సంజయ్‌సింగ్ అనే వ్యక్తితో వివాహమైంది. వారికి ఓ కుమార్తె కూడా ఉంది. దయచేసి ఈ వాస్తవాలను రికార్డుల్లో స్పష్టంగా రాయండి’’ అని విజయలక్ష్మి ఆ లేఖలో పేర్కొన్నారు.
విజయలక్ష్మితో వివాహమైనప్పటికీ దర్శన్ కొంతకాలంగా కన్నడ నటి పవిత్రతో సన్నిహితంగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే తమ బంధానికి పదేళ్లు అంటూ ఇటీవల నటి ఓ వీడియో పోస్ట్ చేసింది. దీంతో వీరి వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈ సంబంధం వల్ల విజయలక్ష్మికి అన్యాయం జరుగుతుందని బాధపడిన దర్శన్ అభిమాని రేణుకాస్వామి.. పవిత్రకు అశ్లీల సందేశాలు, అసభ్య హెచ్చరికలు చేశాడని పోలీసులు దర్యాప్తులో తెలిపారు. అదే అతడి హత్యకు దారితీసిందని నిర్థారించారు. ఆ సందేశాల విషయం దర్శనకు చెప్పడంతో అతను ఆగ్రహానికి గురై రేణుకాస్వామిపై దాడి చేశాడని పవిత్ర విచారణలో అంగీకరించినట్లు తెలిసింది. ఈ కేసులో వీరిద్దరితో పాటు మరో 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం వీరంతా కస్టడీలో ఉన్నారు. దర్శన్, నటి పవిత్ర గౌడ సహా మిగిలిన వారికి జ్యుడీషియల్ కస్టడీ పొడగిస్తూ కోర్టు ఉత్వర్వులు ఇచ్చింది. జులై 18వరకు కస్టడీని పొడిగిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. గతంలో విధించిన జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో దర్శన్, పవిత్రతో పాటు మొత్తం 17 మంది నిందితులను పోలీసులు బెంగళూరు, తుమకూరు జైళ్ల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మెజిరేస్టట్ ఎదుట హాజరుపరచగా.. జులై 18వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించారు.
నాకు బిడ్డలాంటి వాడు..
నటుడు దర్శన్ గురించి నటి, మాజీ ఎంపీ సుమలత స్పందించారు. కుమారుడిని కోల్పోయిన తల్లిదండ్రులకు, రేణుకాస్వామిని కోల్పోయిన భార్యకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తాను మౌనంగా ఉండటం వెనుక చెప్పలేని బాధ ఉందని అన్నారు సుమలత. దర్శన్ స్టార్ కాక ముందు 25 ఏళ్ల నుంచి తెలుసు. అంబరీశ్‌ను అప్పాజీగా గౌరవించేవాడు. నన్ను తల్లిగా భావించేవాడు. ఏ తల్లి కూడా కుమారుడిని ఇటువంటి పరిస్థితిలో చూడటాన్ని సహించదు. దర్శన్‌కు ఇలాంటి కృత్యాలు చేేస మనస్తత్వం లేదు. దర్శన్ భార్య విజయలక్ష్మితోపాటు కుమారుడి పట్ల సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్ నన్ను ఎంతో బాధ కలిగించాయి. ఇప్పటికే భయానక పరిస్థితిని ఎదుర్కొంటున్న వారి పట్ల కామెంట్లు వారి కుటుంబాలపై ఎంతటి ప్రభావం చూపుతాయనేది పరిగణించాలి’’ అని ఆమె అన్నారు.