Tovino Thomas: నేను చూసిన తొలి తెలుగు సినిమా ఆయనదే!

ABN, Publish Date - Sep 09 , 2024 | 12:08 PM

మలయాళ నటుడు టొవినో థామస్‌ విభిన్న కథలు, వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటారు. ఆయా పాత్రల ద్వారా ఆయనకు చక్కని గుర్తింపు లభించింది.

మలయాళ నటుడు టొవినో థామస్‌ (Tovino Thomas) విభిన్న కథలు, వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటారు. ఆయా పాత్రల ద్వారా ఆయనకు చక్కని గుర్తింపు లభించింది. తాజాగా ఆయన నటించిన చిత్రం 'ARM' నటిస్తున్న 50వ చిత్రమిది. కృతి శెట్టి(Krithi Shetty), ఐశ్వర్య రాజేష్‌, (Aishwarya rajesh) సురభి లక్ష్మి నాయికలుగా నటించారు. జితిన్‌ లాల్‌ (hathin lal) దర్శకుడిగా పరిచయమవుతున్నారు. డాక్టర్‌ జకారియా థామస్‌తో కలిసి లిస్టిన్‌ స్టీఫెన్‌ నిర్మించారు. తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్‌ డిస్ర్టిబ్యూటర్స్‌ గ్రాండ్‌ గా విడుదల చేస్తున్నారు. సెప్టెంబర్‌ 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో టోవినో థామస్‌ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.

చిన్న ఆర్టిస్ట్‌గా కెరీర్‌ మొదలుపెట్టా. సపోర్టింగ్‌, కామెడీ, విలన్‌ పేరు తెస్తుందనే నమ్మకం ఉన్న ప్రతి పాత్ర చేశా. 2016 నుంచి లీడ్‌ రోల్స్‌ చేస్తున్నాను. యాక్టర్‌ కావాలనేది నా డ్రీం. ఇప్పుడా డ్రీంలో జీవిస్తున్నాను. ఆర్మ్‌ ప్రారంభించినప్పుడు ఇది నా 50వ చిత్రం అవుతుందని తెలీదు. చాలా ఎక్సయిటింగ్‌ స్క్రిప్ట్.  మూడు డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌ చేయడం పెద్ద సవాల్‌గా అనిపించింది.  డైరెక్టర్‌ నాపై నమ్మకం ఉంచారు. ఈ సినిమా కోసం వర్క్‌షాప్స్‌ చేశాం. మూడు పాత్రలు దేనికదే ప్రత్యేకంగా ఉంటుంది.  ఇందులో దొంగగా కనిపించే మణి పాత్ర కొంచెం ఎక్కువ ఇష్టం. ఆ పాత్రను ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తారు. ఈ సినిమా కోసం ఆరు నెలల్లో కళరి విద్యను బాగా ప్రాక్టీస్‌ చేశా. దానిపై కొంత అవగాహన వచ్చింది. దర్శకుడు జతిన్‌తో ఎనిమిదేళ్ల జర్నీ నాది. నా కెరీర్‌లో 80శాతం సినిమాలు కొత్త దర్శకులతోనే చేశాను. పరస్పర నమ్మకంతోనే ఇది సాధ్యపడుతుంది.


ఇందులో నాన్‌ లీనియర్‌ స్క్రీన్ ప్లే వుంటుంది. టైం పీరియడ్స్‌ని ఆడియన్స్‌ సులువుగా అర్థం చేసుకుంటారు. డైరెక్టర్‌ ప్రతి డిటెయిల్‌ని చాలా చక్కగా తెరకెక్కించారు. ఇక హీరోయిన్లు ముగ్గురు అద్భుతంగా నటించారు. ఈ సినిమాకి ఇమాజినరీ ఫిక్షనల్‌ వరల్డ్‌ని క్రియేట్‌ చేశాం. అందరినీ కథలో లీనం చేయడం కోసం త్రీడీ చాలా హెల్ప్‌ అవుతుంది. ఇంగ్లిష్‌, స్పానిస్‌ భాషల్లో కూడా విడుదల చేస్తున్నాం. యూనివర్శల్‌గా కనెక్ట్‌ అయ్యే ఈ సినిమాను  దాదాపు ముఫ్పై భాషల్లో సబ్‌ టైటిల్స్‌తో విడుదల చేస్తున్నాం.

ARM ‘అజాయంతే రందం మోషణం’. అజయన్‌ రెండో దొంగతనం అని దీని అర్థం. మిగతా భాషల వారికి ఈ పేరు పలకడం కాస్త ఇబ్బందిగా వుంటుంది. అందకే అందరూ పలికే విధంగా ఈ టైటిల్‌ పెట్టాం. ునడిగర్‌’ సినిమా కోసం మైత్రీ మూవీ మేకర్స్‌తో అసోషియేట్‌ అయ్యాను. వారుతో నాకు జర్నీ వుంది. మైత్రీ లాంటి టాప్‌ డిస్ట్రిబ్యూటర్స్  సినిమాని తెలుగులో రిలీజ్‌ చేయడం ఆనందంగా వుంది.


- ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్తదనం వుండే కథ, పాత్ర చేయాలనే నా ప్రయత్నం. ఎక్స్‌ ప్లోర్‌ చేయాల్సింది చాలా ఉంది. సినిమా సినిమాకు ఏదో ఒక కొత్త అంశం నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నా. తెలుగు సినిమాలు బాగా చూస్తా. నేను చూసిన మొదటి సినిమా చిరంజీవి గారి ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ (Jagadeka veerudu Athiloka sudnari) తెలుగు స్క్రిప్ట్ డిస్కర్షన్స్‌ జరుగుతుంటాయి. చూద్దాం ఏం జరుగుతుందో.

 

Updated Date - Sep 09 , 2024 | 12:11 PM