మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Shankar Daughter Marriage: శంకర్‌ కూతురి పెళ్లిలో చిరు కుటుంబం సందడి!

ABN, Publish Date - Apr 16 , 2024 | 02:19 PM

దక్షిణాది అగ్ర దర్శకుడు శంకర్‌ (Shankar) కూతురు వివాహం చెన్నైలో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు తమిళ.. తారాలోకం తరలి వచ్చింది. ఈ వివాహ వేడుకలో టాలీవుడ్‌ మెగస్టార్‌ చిరంజీవి (Chirajeevi) సందడి చేశారు.

Shankar Daughter marriage

దక్షిణాది అగ్ర దర్శకుడు శంకర్‌ (Shankar) కూతురు వివాహం చెన్నైలో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు తమిళ.. తారాలోకం తరలి వచ్చింది. తన దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఉన్న తరుణ్‌ కార్తికేయన్‌కు(Tarun Karthikeyan) తన పెద్ద కూతురు ఐశ్వర్య (Aishwarya)నిశ్చితార్థం రెండు నెలల క్రితం జరిగిన సంగతి తెలిసిందే! సోమవారం వీరిద్దరూ మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. ఈ వివాహ వేడుకలో టాలీవుడ్‌ మెగస్టార్‌ చిరంజీవి (Chirajeevi) సందడి చేశారు. ఆయన సతీమణి సురేఖ తో కలిసి హాజరయ్యారు. నూతన జంటను ఆశీస్సులు అందించారు. అలాగే రామ్‌చరణ్‌, ఉపాసన దంపతులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.


అతికొద్ది మంది సమక్షంలో జరిగిన ఈ వివాహ వేడుకకు తమిళ ఇండస్ట్రీకి  చెందిన దిగ్గజ నటులంతా హజరై నూతన వధూవరులను అశీర్వదించారు. రజనీకాంత్‌, కమల్‌హసన్‌, విక్రమ్‌, సూర్య, కార్తి, నయనతార, మణిరత్నం , సుహాసిని, భారతీరాజా, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.

ప్రస్తుతం రామ్‌చరణ్‌ (Ram charan) శంకర్‌ దర్శకత్వంలో గేమ్‌ ఛేంజర్‌ (Game changer) చిత్రంలో నటిస్తున్నారు. భారీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుంది. సెప్టెంబర్‌, అక్టోబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Updated Date - Apr 16 , 2024 | 02:26 PM