Rakshit Shetty: రక్షితశైట్టిపై కేసు నమోదు!
ABN, Publish Date - Jul 15 , 2024 | 04:15 PM
కన్నడ నటుడు, నిర్మాత రక్షిత్‌శెట్టిపై (Rakshith SHetty) కేసు నమోదైంది. తమ సంస్థకు చెందిన పాటలు కాపీ కొట్టారని పేర్కొంటూ ఎంఆర్టీ మ్యూజిక్ కంపెనీ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది
కన్నడ నటుడు, నిర్మాత రక్షిత్‌శెట్టిపై (Rakshith SHetty) కేసు నమోదైంది. తమ సంస్థకు చెందిన పాటలు కాపీ కొట్టారని పేర్కొంటూ ఎంఆర్టీ మ్యూజిక్ కంపెనీ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ‘న్యాయ ఎల్లిదే’, ‘గాలిమాతు’ చిత్రాల్లోని పాటలను రక్షిత్, ఆయనకు చెందిన నిర్మాణసంస్థ పరంవా స్టూడియోస్ ‘బ్యాచిలర్ పార్టీ’లో (Audio Rites issue) కాపీ కొట్టారని తెలియజేసింది. తమ అనుమతి లేకుండా ఇలా చేయడం ఏమాత్రం సరికాదని పేర్కొంది. ఎఫ్ఐఆర్ (FIR on Rakshit shetty)నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ విషయంపై స్పందించమని కోరుతూ రక్షిత్‌కు నోటీసులు జారీ చేశారు.
దిగంత్, అచ్యుత్‌కుమార్, యోగేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్యాచిలర్ పార్టీ’. రక్షిత్ శెట్టి నిర్మించారు. జనవరిలో విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందన కు పరిమితమైంది. ప్రస్తుతం ఇది అమెజాన్ ప్రైమ్ వేదికగా అందుబాటులో ఉంది. ఆ పాటలకు సంబంధించిన హక్కుల విషయమై గతంలో ఎంఆర్టీ స్టూడియోస్, రక్షిత్ శెట్టి సమావేశమైనప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోయిందని శాండల్‌వుడ్‌లో టాక్.