మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

BUJJI AT ANUPATTI: భార్య చెప్పిన కథతో.. సినిమా తీసిన దర్శకుడు .

ABN, Publish Date - May 30 , 2024 | 12:21 PM

తన భార్య చెప్పిన కథకు మెరుగులుదిద్ది ఆ స్టోరీతో ‘బుజ్జి ఎట్‌ అనుపట్టి’ చిత్రాన్ని తెరకెక్కించినట్టు దర్శకుడు రామ్‌ కందస్వామి తెలిపారు. ఈ చిత్రాన్ని ఈ నెల 31న విడుదల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా రీసెంట్‌గా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు.

Bujjiat Anupatti

తన భార్య చెప్పిన కథకు మెరుగులుదిద్ది ఆ స్టోరీతో ‘బుజ్జి ఎట్‌ అనుపట్టి’ (BUJJI AT ANUPATTI)చిత్రాన్ని తెరకెక్కించినట్టు దర్శకుడు రామ్‌ కందస్వామి (Raam Kandasamy) తెలిపారు. కమల్‌ కుమార్ (Kamalkumar), నక్సలైట్‌ వైదీశ్వరి, కార్తీక్‌ విజయ్‌, బాలనటి ప్రణతి, లావణ్య కన్మణి, నక్సలైట్‌ రామ్‌కుమార్‌, నక్సలైట్‌ మీనా తదిరులు నటించిన ఈ చిత్రాన్ని ఈ నెల 31న విడుదల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా రీసెంట్‌గా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, ‘ఒక రోజు మా ఇంటిలో కుటుంబ సభ్యులంతా కలిసి మాట్లాడుకునే సమయంలో నా భార్య ఓ విషయాన్ని ప్రస్తావించింది. సమాజంలోని ప్రతి ఒక్కరూ శునకాలు, పిల్లులను పెంచుకుంటుంటారు. కానీ మేకను ఎవరు ప్రాణానికి ప్రాణంగా పెంచుకోరని చెప్పడంతో ఈ పాయింట్‌ బాగా నచ్చింది. ఇది ఒక మంచి లైన్‌ కావడంతో దాన్ని ప్రధాన కథాంశంగా చేసుకుని స్టోరీ డెవలప్‌ చేశాను. పైగా పిల్లల కోణంలో ఈ కథ చెప్పాలని భావించాను.


ఈ చిత్రంలో నటించే బాల నటిని కూడా నేను ఎంపిక చేసుకోలేదు. కానీ, చివరి నిమిషంలో ప్రణితిని ఎంపిక చేశాం. ఈ పాప చాలా బాగా నటించింది. తన స్నేహితుడు వేల్‌ మాణిక్యం ద్వారా సంగీత దర్శకుడు కార్తీక్‌ రాజా పరిచయమయ్యాడు. సంగీత దర్శకుడు కార్తీక్‌ రాజా (Karthik Raja) రెమ్యునరేషన్‌ తీసుకోకుండా చక్కటి సంగీతం అందించారు. ఆయనకు ధన్యవాదాలు. మీడియా అండగా నిలుస్తుందన్న నమ్మకంతో ఈ నెల 31న విడుదల చేస్తున్నాం’ అని తెలిపారు. ఆ తర్వాత చిత్రంలో నటించిన ప్రధాన నటీనటులు, టెక్నీషియన్లు మాట్లాడారు.

Updated Date - May 30 , 2024 | 12:21 PM