Mayan: నాలుగేండ్ల త‌ర్వాత థియేట‌ర్ల‌లోకి.. ప్రియాంక మోహ‌న్, బిందు మాధవి ఫాంటసీ, హిస్టరీ, థ్రిల్లర్‌

ABN, Publish Date - Aug 11 , 2024 | 09:31 AM

ప్రియాంకామోహ‌న్ కెరీర్ తొలినాళ్లలో సుమారు 2019లో మొద‌లు పెట్టిన ఈ చిత్రం ఎట్ట‌కేల‌కు అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ఐదేండ్ల త‌ర్వాత ఇప్పుడు రీలీజ్‌కు రెడీ అయింది.

mayan

చిత్రపరిశ్రమలో ఎవరూ ఊహించని విధంగా అనేక సినిమాలు ఎప్పుడు షూటింగ్ జ‌రిగాయో, ఎప్పుడు పూర్త‌య్యాయో బ‌య‌ట‌కు తెలియ‌కుండానే థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంటాయి. అలాంటి సినిమాల సక్సెస్‌ల వెనుక నటీనటులతో పాటు సాంకేతికవర్గం కూడా కీలకంగా వ్యవహరిస్తుంది. ఈ కోవకు చెందిన చిత్రమే ‘మాయన్‌’. వినోద్‌ మోహన్ (Vinod Mohan), ప్రియాంక మోహ‌న్ (Priyanka Mohan), బిందు మాధవి (Bindhu Madhavi) ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ చిత్రాన్ని డైరెక్టుగా ఆంగ్లంలో నిర్మించి ఆ త‌ర్వాత తమిళంలోనూ తెరకెక్కించడం విశేషం.

ప్రియాంకామోహ‌న్ కెరీర్ తొలినాళ్లలో సుమారు 2019లో మొద‌లు పెట్టిన ఈ చిత్రం ఎట్ట‌కేల‌కు అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ఐదేండ్ల త‌ర్వాత ఇప్పుడు రీలీజ్‌కు రెడీ అయింది. ఫాంటసీ, హిస్టరీ, థ్రిల్లర్‌ మూడు ర‌కాల జానర్ల క‌థాంశంతో రూపొందించిన ఈ మూవీలో దాదాపు 50 శాతానికి పైగా గ్రాఫిక్స్‌ వినియోగించడం విశేషం. ఒక మనిషి జీవితంలో తారసపడే అంశాలతో రెండు వెర్షన్లలో ఈ సినిమాను తెర‌కెక్కించారు.

ఒకటి మాయన్‌ క్యాలెండర్‌, మాయన్‌ వరల్డ్‌. రెండోది ప్రపంచం అంతమైందా? లేదా? మాయన్‌, దేవుడి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనే వెర్ష‌న్ల‌లో సినిమా ఉండ‌నుంది. మొదటి వెర్షన్‌లో కంటే రెండో వెర్షన్‌లో ఎక్కువ గ్రాఫిక్స్ ఉండ‌నున్నాయి. అయితే, తొలి భాగాన్ని మాత్రం సెప్టెంబ‌ర్‌ 19వ తేదీన థియేటర్‌లో విడుదల చేసి, రెండో భాగాన్ని ఓటీటీలో విడుదల చేసేందుకు మేక‌ర్స్‌ ప్లాన్‌ చేశారు.


జె.రాజేష్‌ ఖన్నా (Rajes Kanna) కథ సమకూర్చి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఫాక్స్‌ అండ్‌ క్రో స్టూడియోస్‌ పతాకంపై నిర్మించగా జీవీకేఎం ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ టాటో గణేష్‌ మోహన సుందరం ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించారు. త‌మిళ వెర్స‌న్‌లో బిందుమాద‌వి న‌టించ‌గా, ఇంగ్లీష్‌ వెర్షన్‌లో ప్రియాంక మోహన్ (Priyanka Mohan) కీలక పాత్ర పోషించారు.

వీరితో పాటు పిజా బాజ్‌పాయ్‌, జాన్‌ విజయ్ (John Vijay), ఆడుకలం నరేన్ (Adukalam Naren), సాయి దీనా ( Sai Dheena), గంజా కరుపు, రాజ సింహన్‌, శ్రీరంజని, రంజనా నాచ్చియార్‌ తదితరులు నటించారు. చివరి దశ నిర్మాణ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రానికి రూపర్ట్‌ జోన్స్ (Jones Rupert) సంగీతం అందించారు.

Updated Date - Aug 11 , 2024 | 09:32 AM