Bun Butter Jam: బిగ్‌బాస్5 విన్న‌ర్ హీరోగా.. ‘బన్‌ బట్టర్‌ జామ్‌’

ABN, Publish Date - Jul 04 , 2024 | 02:00 PM

త‌మిళ ‘‘బిగ్‌ బాస్‌ సీజన్‌-5’ రియాల్టీ షో విన్న‌ర్‌ రాజు జయమోహన్ హీరోగా పరిచయమవుతూ ఓ త‌మిళ చిత్రం రూపొందనుంది. దర్శకుడు రాఘవ్‌ మిర్థాత్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

Bun Butter Jam

త‌మిళ ‘‘బిగ్‌ బాస్‌ సీజన్‌-5’ (BB Tamil Season 5)రియాల్టీ షో విన్న‌ర్‌ రాజు జయమోహన్ (Raju Jayamohan) హీరోగా పరిచయమవుతూ ఓ త‌మిళ చిత్రం రూపొందనుంది. దర్శకుడు రాఘవ్‌ మిర్థాత్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గ‌తంలో నాగేష్‌, శివకార్తికేయన్‌ నటించిన ‘ఎదిర్‌ నీచ్చల్‌’ సినిమా తరహాలోనే తమ ప్రాజెక్టు ఉంటుందని, ఈ చిత్రానికి ‘బన్‌ బట్టర్‌ జామ్‌’ (Bun Butter Jam)అనే పేరు ఖరారు చేసినట్టు దర్శకుడు చెప్పారు.

రెయిన్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్మెంట్‌ పతాకంపై సురేష్‌ సుబ్రమణియన్‌ నిర్మిస్తున్నారు. జై హీరోగా ఈయన నిర్మించిన తొలి సినిమా ‘ఎన్నితుణిగ’ (Yenni Thuniga) మంచి విజయాన్ని సాధించిన విషయం తెల్సిందే. ‘కాలంగలిల్‌ అవల్‌ వసంతం’ (KaalangalilAvalVasantham )అనే చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన రాఘవ్‌కు ఇది రెండో చిత్రం. ప్రస్తుతం ఈ చిత్రం చివరి దశ నిర్మాణ పనులను జరుపుకుంటోందన్నారు.


మనిషిని ఎన్ని సమస్యలు చుట్టుముట్టిన ఆ క్షణాలను సంపూర్ణంగా ఆస్వాదిస్తూ జీవించడం అలవాటు చేసుకుంటే జీవితంలో సంతోషానికి లోటు ఉండదనే కాన్సెప్టుతో ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఇతర పాత్రల్లో సీనియర్‌ నటి శరణ్య పొన్‌వణ్ణన్‌, దేవదర్శిని, చార్లీ, మైఖేల్‌ తంగదురై, వీజే పప్పు తదితరులు నటించారు. ఈ నెల 8వ తేదీన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

Updated Date - Jul 04 , 2024 | 02:57 PM