Ashika Ranganath : బాధలో ఆషిక రంగనాథ్.. అయినా మంచికే
ABN, Publish Date - Dec 02 , 2024 | 11:31 AM
కన్నడలో ‘క్రేజీ బాయ్’ అనే చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత తెలుగులో నాగార్జునకు జంటగా 'నా సామిరంగ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు ఆషికా రంగనాథ్‌కు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది.
సౌత్ ఇండస్ట్రీలో ఎక్కువగా చలామణీ అవుతున్న కథానాయికలు మలయాళం, కన్నడ బ్యూటీలే. శాండల్‌వుడ్ Sandal wood) నుంచి అనుష్క శెట్టి, కృతీశెట్టి, రష్మిక మందన్నా, శ్రద్ధా శ్రీనాథ్, నభా నటేష్, పూజాహెగ్డే, ప్రణీత, మాలీవుడ్ నుంచి అనుపమా పరమేశ్వరన్, సంయుక్త మీనన్, ప్రియాంక మోహనన్, కీర్తి సురేశ్, మాళవిక మోహనన్ వంటి తారలు తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమల్లో రాణిస్తున్నారు. కన్నడ నుంచి వచ్చిన రష్మిక నేషనల్ క్రష్‌గా వెలిగిపోతుంది. ఆ తరహాలోనే ఆషికా రంగనాథ్ కూడా దూసుకెళ్తున్నారు. తన మాతృభాష కన్నడలో ‘క్రేజీ బాయ్’ అనే చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత తెలుగులో నాగార్జునకు జంటగా 'నా సామిరంగ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు ఆషికా రంగనాథ్‌కు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. దీంతో కోలీవుడ్ దృష్టి ఆమెపై పడింది. ప్రస్తుతం అధర్వకు జంటగా 'పట్టత్తు అరసన్’ చిత్రంతో రంగ ప్రవేశం చేశారు. కాగా తాజాగా నటుడు సిద్థార్థ్ కథానాయకుడిగా నటించిన ‘మిస్ యూ’ చిత్రంలో ఆమె నటించారు. దీంతోపాటు కార్తీ సరసన 'సర్థార్ 2', మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'విశ్వంభర’లో నటించే అవకాశం అందుకున్నారు.
'మిస్ యూ’ (Miss U)చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకుని నవంబర్ 29న విడుదల కావాల్సింది. అయితే తమిళనాడులో భారీ వర్షాలు కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ప్రకటించింది. దీనిపై ఆషికా రంగనాధ్ స్పందించారు. ుూమిస్ యూ చిత్రం విడుదల వాయిదా పడటం ఎంతో బాధ కలిగించింది. అయితే అంతా బాగానే జరుగుతుందని నమ్ముతున్నాను. వాతావరణం సహకారం కూడా చాలా అవసరం. రాబోవు విడుదల తేది వాయిదా పడిన తేదీ కంటే మంచిది అవుతుందని భావిస్తున్నా. అది చిత్రాన్ని అత్యధిక ప్రేక్షకుల మధ్యకు తీసుకెళ్లడానికి ఉపకరిస్తుందని, ఈ విషయాన్ని గమనిేస్త మిస్ యూ చిత్రం విడుదల వాయిదా అనే నిర్ణయం సరైనదేనని నమ్ముతున్నట్లు’’ ఆమె పేర్కొన్నారు.