Darshan Case: దర్శన్ ఇలా చేశాడంటే నమ్మశక్యంగా లేదు.. కన్నడ నటి  

ABN, Publish Date - Jun 22 , 2024 | 02:27 PM

కన్నడ నటుడు దర్శన్ తన అభిమాని రేణుక స్వామిని హత్య చేశాడన్న కారణంతో అరెస్ట్‌ కావడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తనని అభిమానించే వ్యక్తిని వ్యక్తిగత కారణాలతో అత్యంత కిరాతకంగా చంపాడనే ఆరోపణలతో పోలీసులు దర్శన్ ను అరెస్ట్‌ చేశారు.

కన్నడ నటుడు దర్శన్ (Darshan) తన అభిమాని రేణుక స్వామిని (Renuka Swami murder case)హత్య చేశాడన్న కారణంతో అరెస్ట్‌ కావడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తనని అభిమానించే వ్యక్తిని వ్యక్తిగత కారణాలతో అత్యంత కిరాతకంగా చంపాడనే ఆరోపణలతో పోలీసులు దర్శన్ ను అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం అతన్ని జైల్లో పెట్టి దర్యాప్తు చేస్తున్నారు. కర్ణాటకలోని చిత్రదుర్గకి చెందిన రేణుకాస్వామి దర్శన్‌కి వీరాభిమాని. అయితే తన అభిమాన హీరో కుటుంబంలో కలహాలకు కారణం పవిత్ర గౌడ అని భావించిన రేణుకా స్వామి ఆమెకు అసభ్య వీడియోలు పంపించాడు. ఈ విషయాన్ని పవిత్ర దర్శన్‌కి చెప్పగా.. ఇతడు దారుణంగా టార్చర్‌ పెట్టి మరీ చంపాడు.. పోస్ట్‌ మార్టం రిపోర్ట్స్‌ ప్రకారం రేణుకాస్వామి శరీరంపై 15కి పైగా గాయాలు, కరెంట్‌ షాక్‌ ఇచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ కేసులో దర్శన్‌, పవిత్రతోపాటు (Pavitra gowda)దాదాపు 11 మందికి పైగా జైల్లో ఉన్నారు. ఈ క్రమంలో ఆ కేసు విషయంలో సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి. మరోవైపు దర్శన్‌తో కలిసి పనిచేసిన కొందరు లేడీ యాక్టర్స్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇటీవల  సంజనా గల్రానీ దర్శన్‌ ప్రవర్తన గురించి చెప్పగా, తాజాగా నటి అనూష రాయ్‌(Anusha Rai).. దర్శన్‌ ఇతరులతో ఎలా ఉంటాడో చెప్పుకొచ్చింది.



‘హత్య కేసులో దర్శన్‌ అరెస్ట్‌ కావడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను.  దర్శన్‌ అందరినీ బాగా చూసుకుంటాడు. కాకపోతే కోపం ఎక్కువ. కోపం వస్తే ఎదుటి వ్యక్తి ఎవరైనా లెక్క చేయడు. దీంతో అందరూ అతనితో చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. నేను కూడా పరిధి దాటకుండా మాట్లాడతాను. తనకు కోపం ఎక్కువ అని గతంలో ఓ ఇంటర్వ్యూలో కూడా  చెప్పాడు. అయితే దర్శన్‌కి ఈ కేసుకి సంబంధం ఉందనే విషయం మాత్రం నాకు తెలియదు. దర్శన్‌పై కోపం ఉంటే అతన్ని ఏమైనా అనుకోండి, తిట్టుకోండి కానీ ఆయన భార్య, కొడుకుని మాత్రం తిట్టడం కరెక్ట్‌ కాదు.’ అని అనుష రాయ్‌ చెప్పుకొచ్చింది.


Updated Date - Jun 22 , 2024 | 02:32 PM