మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Anikha surendran: నేను కూడా మనిషినే.. అంటూ ఎమోషనల్‌ అయిన నటి!

ABN, Publish Date - May 19 , 2024 | 10:55 PM

బాలనటిగా పలు మలయాళ, తమిళ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు అనిఖా సురేంద్రన్(anikha surendran) . 'బుట్ట బొమ్మ’ (butta bomma)చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ కి  పరిచయమైంది.


బాలనటిగా పలు మలయాళ, తమిళ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు అనిఖా సురేంద్రన్(anikha surendran) . 'బుట్ట బొమ్మ’ (butta bomma)చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ కి  పరిచయమైంది. సితార ఎంటర్టైన్మెంట్స్‌ నిర్మించిన ఈ చిత్రం అంతగా ఆకట్టుకోకపోవడంతో ఈ సినిమా వల్ల హీరోయిన్ గా ఆమెకు అంతగా ఉపయోగపడలేదు. అయితే ఆమె తమిళ, మలయాళంలో మాత్రం ఎదో ఒక సినిమా చేస్తూ ఆసక్తికరంగా వార్తల్లో నిలుస్తోంది. అజిత్‌ నటించిన 'ఎన్నై అరిందాల్‌’, విశ్వాసం వంటి తమిళ చిత్రాలలో బాలనటి పాత్రలో అనిఖా మంచి పేరు సంపాదించుకుంది. 'నాన్  రౌడీ థాన్‌', 'మృధన్‌' వంటి  చిత్రాల్లో కూడా ఆమె నటించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె సోషల్‌ మీడియాలో  తనకు వస్తున్న బ్యాడ్‌ కామెంట్స్‌ గురించి స్పందించింది. 

"చిత్రసీమలో ఇలాంటి విమర్శలు నటీమణులు పెద్ద ఎత్తున ఎదుర్కొంటున్నారు. ఆకర్షణీయంగా దుస్తులు ధరించడం నా వ్యక్తిగత విషయం. నా స్టైలింగ్‌ నా ఇష్టం. విమర్శించారని... నా ఇష్టాన్ని పక్కన పెట్టలేను. ఈ విమర్శలు వస్తాయి.. పోతాయి. ఇవన్నీ జీవితంలో ఒక భాగం మాత్రమే. కామెంట్‌ చేయాలనే ఉద్దేశం ఉన్నవారు చీర కట్టుకున్నా కామెంట్స్‌ చేస్తారు. అయితే నా దుస్తుల విషయంలో కొందరు చేసే కామెంట్లు నన్ను చాలా ప్రభావితం చేస్తాయి. నేను కూడా మనిషినే. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తట్టుకోవడం కష్టంగా ఉంటుంది’’ అని అనిఖా ఎమోషనల్‌ అయింది.

Updated Date - May 19 , 2024 | 10:56 PM