Ajith Kumar: తాత్కాలిక విరామం.. పెద్ద ప్లానే వేశారు!

ABN, Publish Date - Aug 09 , 2024 | 05:22 PM

తమిళ స్టార్‌ అజిత్  ప్రస్తుతం రెండు చిత్రాలతో  ‘విదా ముయార్చి’(Vidaa Muyarchi), ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లి’ (good Bad ugly) చిత్రాలతో బిజీగా ఉన్నారు.  ‘విదా ముయార్చి’ షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్  పనుల్లో ఉంది.

తమిళ స్టార్‌ అజిత్  ప్రస్తుతం రెండు చిత్రాలతో  ‘విదా ముయార్చి’(Vidaa Muyarchi), ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లి’ (good Bad ugly) చిత్రాలతో బిజీగా ఉన్నారు.  ‘విదా ముయార్చి’ షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్  పనుల్లో ఉంది. తాజాగా అజిత్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ రెండు చిత్రాల తర్వాత కొన్ని నెలలపాటు ఆయన సినిమాలకు విరామం ప్రకటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.. ప్రస్తుతం ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లి’ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా చిత్రీకరణ పూర్తికాగానే అజిత్‌ బ్రేక్‌ తీసుకోనున్నారట. ఆరు నెలలు విరామం ప్రకటించనున్నారని.. కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లనున్నట్లు సమాచారం. అలాగే అజిత్  బైక్‌ రైడింగ్‌ అంటే ఎంతో ఇష్టమో తెలిసిందే! సినిమాలకు బ్రేక్‌ ఇచ్చి ఆరు నెలలపాటు అజిత్‌ బైక్‌ టూర్‌ కూడా ప్లాన్‌ చేశారట. దీనిపై అధికారిక ప్రకటన అయితే రాలేదు. అజిత్  నిజంగానే ప్లాన్ చేశారా? లేదా అన్నది తెలియాల్సి ఉంది. 
 

అజిత్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘విదా ముయార్చి’. మాగిజ్‌ తిరుమేని దర్శకత్వంలో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఇది రూపొందుతోంది. త్రిష కథానాయిక. అక్టోబర్‌లో విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆరవ్‌ కిజార్‌ లుక్‌ను విడుదల చేశారు. ఇక ఇటీవల అజిత్‌ -ప్రశాంత్‌ నీల్‌ కాంబోలో ఓ ప్రాజెక్ట్‌ రానున్నట్లు వార్తలొచ్చాయి. రెండు భాగాలుగా తెరకెక్కనుందని, ఇప్పటికే చర్చలు జరిగాయని తమిళ మీడియా చెబుతోంది. ఇదంతా నిజం అయితే టూర్‌ తర్వాత అజిత్ పట్టాలెక్కించే చిత్రం ఇదే అవుతుంది. 

Updated Date - Aug 09 , 2024 | 05:23 PM