మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Trisha: డబ్బులిచ్చి త్రిషను పిలిపించుకున్నారు.. నటిపై పొలిటీషియన్ ఘోరమైన కామెంట్స్! వీడియో వైర‌ల్

ABN, Publish Date - Feb 20 , 2024 | 09:43 PM

తమిళనాట మరో వివాదం మొదలైంది. నిన్నటివరకు మన్సూర్ అలీఖాన్, త్రిష వివాదం నడవగా తాజాగా మరోసారి త్రిష వార్తల్లో కెక్కింది. ఈ సారి ఈ వివాదం అంతకు మించి అనే రేంజ్లో అనేలా తయారైంది.

TRISHA

తమిళనాట మరో వివాదం మొదలైంది. నిన్నటి వరకు మన్సూర్ అలీఖాన్, త్రిష (Trisha Krishnan) వివాదం నడవగా తాజాగా మరోసారి త్రిష వార్తల్లో కెక్కింది. ఈ సారి ఈ వివాదం అంతకు మించి అనే రేంజ్ లో అనేలా తయారైంది. అంతకుముందు వచ్చిన వివాదాలు సినిమా ఇండస్ట్రీలో జరుగగా కొంతకాలం వాడీ వేడిగా నడిచి చివరకు కోర్టు దాకా వెళ్లి ఎండ్ కార్డ్ పడ్డ సంగతి తెలిసిందే.

అయితే ఈ సారి అన్నా డీఎమ్కే పార్టీకి చెందిన నాజకీయ నాయకుడు ఏవీ రాజు ఓ సందర్బంలో మీడియాతో మాట్లాడుతూ కొందరు రాజకీయ నాయకులు రూ.25 లక్షలు చెల్లిస్తాం రావాలని త్రిష((Trisha Krishnan))ను కోరినట్లు, రిసార్ట్ కు పిలిపించుకున్నట్లు మాట్లాడాడు. ఇప్పుడు ఈ వీడియూ క్లిప్ కాస్త సోషల్ మీడియాకు ఎక్కడంతో తమిళనాట పెద్ద రచ్చే స్టార్ట్ అయింది.


ఈ విషయంపై వెటనే నటుడు విశాల్ రియాక్ట్ అయ్యాడు. ఓ సినిమా నటిపై తీవ్ర అసభ్యకరంగా కామెంట్లు చేశారని అవి ఏ మాత్రం అమోదయోగ్యం కావని ఖండించాడు. ప్రభుత్వం వెంటనే అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కొరుతూ సదరు నాయకునిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదిలాఉండగా.. అన్నా డీఎమ్‌కే నాయ‌కుని కామెంట్స్ పై త్రిష స్పందిస్తూ ఓ ట్వీట్ చేసింది. ప్ర‌జ‌ల దృష్టిని ఆకర్షించడానికి ఏ స్థాయికైనా దిగజారిపోతున్న‌ నీచమైన మనుషులను ప్రతిసారి చూడటం అసహ్యంగా ఉందన్నారు. ఈ ఘ‌ట‌న‌పై ఉపేక్షించేది లేదని, కఠినమైన చర్యలు తీసుకుంటానని, ఇక అంతా మా లీగ‌ల్ టీమ్ చూసుకుంటుంద‌ని, చెప్పాల్సింది, చేయాల్సింది అంతా వారే చూసుకుంటార‌ని పేర్కొంటూ త్రిష స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ సమస్య ఎంత దూరం వెళుతుందో చూడాలి

Updated Date - Feb 20 , 2024 | 09:59 PM