Pia Bajpiee: ఆరేళ్ల తర్వాత.. రంగం బ్యూటీ రీఎంట్రీ
ABN, Publish Date - Aug 27 , 2024 | 11:35 AM
ఉత్తరప్రదేశ్ నుంచి కోలీవుడ్లోకి అడుగుపెట్టిన నటి పియా బాజ్‌పాయ్ తిరిగి ఆరేళ్ల తర్వాత మళ్లీ ఆమె కోలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోంది.
ఉత్తరప్రదేశ్ నుంచి కోలీవుడ్లోకి అడుగుపెట్టిన నటి పియా బాజ్‌పాయ్ (Pia Bajpiee) తిరిగి ఆరేళ్ల తర్వాత మళ్లీ ఆమె కోలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోంది. ఆరేళ్ల క్రితం 2009లో ఏ.ఎల్.విజయ్ (A. L. Vijay) దర్శకత్వం వహించిన ‘పొయ్ సొల్లపోరోమ్’ (Poi Solla Porom)ద్వారా ఆమె కోలీవుడ్‌కు పరిచయమయింది. ఆ తర్వాత ‘ఏగన్’, ‘గోవా’, ‘బలే పాండియన్’, ‘కో’, ‘చట్టం ఒరు ఇరుట్టరై-2’ చిత్రాల్లో నటించారు. వీటిలో కో (తెలుగులో రంగం) పియాకు మంచి పేరు తీసుకువచ్చింది.
కానీ.. 2018లో టొవినో థామస్ (Tovino Thoma) హీరోగా వచ్చిన ‘అభియుం నానుమ్’(Abhiyum Anuvum) చిత్రంలో చివరిసారిగా కనిపించిన ఈ చిన్నది ఆ తర్వాత ఆమెకు సరైన అవకాశాలు లేకపోవడంతో ఇండస్ట్రీకి దూరమయ్యారు.
తెలుగులోనూ నిన్ను కలిశాక, బ్యాక్ బెంచ్ స్టూడెంట్, దళం వంటి మూడు సినిమాల్లో మూడు నాలుగు సినిమాలు చేసిన పియా బాజ్‌పాయ్ (Pia Bajpiee) ఇక్కడా సరైన అవకాశాలను దక్కించుకోలేక పోయింది. తర్వాత బాలీవుడ్‌పై దృష్టి పెట్టి ఓ నాలుగైదు సినిమాలు చేసింది. ప్రతీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ను ఏర్పాటు చేసుకుంది.
అయితే 2019లో షూటింగ్ మొదలు పెట్టిన మాయన్ అనే సినిమాలో బింధు మాదవి, ప్రియాంక మోహన్ళతో కలిసి ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా పియా బాజ్‌పాయ్ (Pia Bajpiee) నటించింది.
వినోద్ మోహన్ (Vinod Mohan) కథానాయకుడిగా నటించగా ఇప్పటికే ఈ సినిమాను డైరెక్టుగా ఆంగ్లంలో నిర్మించి ఆ తర్వాత తమిళంలోనూ తెరకెక్కించడం విశేషం. ఎంఎస్ జోన్స్ రూబెర్ట్ సంగీతం. కె.అరుణ్ ప్రసాద్ ఛాయాగ్రహణం. రెండు భాగాలుగా రానున్న ఈ మూవీ ఫాంటసీ థ్రిల్లర్ జోనర్లో రూపుదిద్దుకుంది.
2019లో మొదలు పెట్టిన ఈ చిత్రం ఎట్టకేలకు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఇప్పుడు రీలీజ్‌కు రెడీ అయింది. ఫాంటసీ, హిస్టరీ, థ్రిల్లర్ మూడు రకాల జానర్ల కథాంశంతో రూపొందించిన ఈ మూవీలో దాదాపు 50 శాతానికి పైగా గ్రాఫిక్స్ ఉపయోగించడం విశేషం.
ఇన్నాళ్లకు ఈ సినిమా ద్వారా పియా బాజ్‌పాయ్ (Pia Bajpiee) ప్రేక్షకుల ముందుకు రానుండడంతో అమె అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే, తొలి భాగాన్ని మాత్రం సెప్టెంబర్ 19వ తేదీన థియేటర్లో విడుదల చేసి, రెండో భాగాన్ని ఓటీటీలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు.