Megha Akash: నా ప్ర‌తిభ చూపించే అవ‌కాశం వ‌చ్చింది

ABN, Publish Date - Aug 01 , 2024 | 12:14 PM

విజయ్‌ ఆంటోనీ హీరోగా వస్తున్న ‘మళై పిడిక్కాద మనిదన్‌’ తెలుగులో తుఫాన్ చిత్రంలో తన పాత్ర సినీ కెరీర్‌కు ఓ టర్నింగ్‌ పాయింట్‌గా నిలుస్తుందని ఆ చిత్ర హీరోయిన్‌ మేఘా ఆకాష్ అభిప్రాయ పడింది.

విజయ్‌ ఆంటోనీ (Vijay Antony) హీరోగా విజయ్‌ మిల్టన్ (Vijay Milton) దర్శకత్వం వహించిన ‘మళై పిడిక్కాద మనిదన్‌’ (Mazhai Pidikkatha Manithan) (తెలుగులో తుఫాన్) చిత్రంలో తన పాత్ర అద్భుతంగా ఉంటుందని, ఇది తన సినీ కెరీర్‌కు ఓ టర్నింగ్‌ పాయింట్‌గా నిలుస్తుందని ఆ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన మేఘా ఆకాష్ (Megha Akash) అభిప్రాయ పడింది.

ఈ సినిమాలో తన పాత్ర గురించి ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘సాధారణంగా విజయ్‌ మిల్టన్‌ (Vijay Milton) రూపొందించే సినిమాల్లో హీరోయిన్‌ పాత్ర ఎంతో బలంగా ఉంటుంది.

ఈ సినిమాకు నన్ను సంప్రదించకముందే, స్టోరీ వినకముందే నా మనసులో ఒక బలమైన ముద్ర పడింది. ఖచ్చితంగా ఈ సినిమాల్లో నా పాత్ర బాగా ఉంటుందని ఊహించాను.


నేను అనుకున్నట్టుగానే సినిమాలో మంచి పాత్ర లభించింది. ప్రతిభ నిరూపించుకునేందుకు ఓ మంచి అవకాశంగా భావిస్తున్నాను. ఈ సినిమా షూటింగ్‌ మొత్తం మరిచిపోలేని ఎన్నో అనుభూతులు మిగిలాయి. ఈ మంచి అవకాశాన్ని ఇచ్చిన చిత్ర బృందానికి ధన్యవాదాలు’ అని (Megha Akash) పేర్కొన్నారు.

Updated Date - Aug 01 , 2024 | 12:14 PM