Andrea Jeremiah: చ‌రిత్ర, పురాణ కథల్లో నటించాలన్న ఆశ, కోరికలు లేవు

ABN, Publish Date - Aug 09 , 2024 | 11:35 AM

చ‌రిత్ర, పురాణ కథల్లో నటించాలన్న ఆశ, కోరికలు లేవని ప్ర‌ముఖ న‌టి, సింగ‌ర్ ఆండ్రియా జెర్మయ్య అన్నారు. తాజాగా ఓ మాడియాతో ఆమె మాట్లాడుతూ ప‌లు ఇంట్రెస్టింగ్ విష‌యాలు తెలిపారు.

Andrea Jeremiah

‘వడ చెన్నై’ (Vada Chennai) సినిమాకు సీక్వెలంటూ నిర్మిస్తే చంద్ర పాత్రలో నటించేందుకు సిద్ధంగా ఉన్నట్టు హీరోయిన్‌ ఆండ్రియా జెర్మయ్య (Andrea Jeremiah) అన్నారు. ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ అవకాశాలపై స్పందించారు. ఇటీవల వచ్చిన చిత్రాల్లో నేను ఒక్క పాట కూడా పాడలేదని త్వరలోనే కొన్ని చిత్రాల్లో పాడుతానని అన్నారు.

ప్ర‌స్తుతం ‘మాస్క్‌’ అనే చిత్రంలో హీరో కవిన్‌తో కలిసి నటిస్తున్నానని అన్నారు. నాకు చ‌రిత్ర, పురాణ కథల్లో నటించాలన్న ఆశ, కోరికలు లేవన్నారు. హీరో విజయ్‌ రాజకీయాల్లోకి రావడాన్ని నేను స్వాగతిస్తున్నాను. కానీ, నాకు మాత్రం ఆ రంగంలోకి రావాలన్న ఆశ లేశమాత్రం కూడా లేదన్నారు.


చిత్ర పరిశ్రమలో నేను ఆశించినట్టుగానే థ్రిల్లర్‌, హార్రర్‌, లవ్‌, కామెడీ ఇలా అన్ని జానర్‌ చిత్రాల్లో నటించాను. ‘వడ చెన్నై’ (Vada Chennai) లో చంద్ర పాత్రకు మంచి గుర్తింపుతో పాటు ప్రశంసలు కూడా వచ్చాయి. ఈ సినిమా రెండో భాగాన్ని దర్శకుడు వెట్రిమారన్‌ తెరకెక్కిస్తే, తిరిగి చంద్ర పాత్రలోనే నటించేందుకు సిద్ధంగా ఉన్నాను. ఇందులో ఎలాంటి సందేహం లేదు’ అని ఆమె పేర్కొన్నారు.

Updated Date - Aug 09 , 2024 | 11:35 AM