మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Marco: జనతా గ్యారేజ్ విల‌న్ ‘మార్కో’ ఫస్ట్ లుక్.. ఇదేం అరాచ‌కం సామీ

ABN, Publish Date - Jun 16 , 2024 | 02:30 PM

‘జనతా గ్యారేజ్’, ‘భాగమతి’, ‘ఖిలాడీ’ ‘యశోద’, మాలికాపురం వంటి చిత్రాలతో తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మలయాళీ నటుడు ఉన్ని ముకుందన్. ఇప్పుడు ఆయ‌న‌ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం మార్కో.

Unni Mukundan

‘జనతా గ్యారేజ్’, ‘భాగమతి’, ‘ఖిలాడీ’ ‘యశోద’, మాలికాపురం వంటి చిత్రాలతో తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మలయాళీ నటుడు ఉన్ని ముకుందన్ (Unni Mukundan). ఇప్పుడు ఆయ‌న‌ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం మార్కో. మైఖేల్, ది గ్రేట్ ఫాదర్ సినిమాల ఫేమ్ హనీఫ్ అదేని (Haneef Adeni) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్ష‌న్ జాన‌ర్‌లో రానున్న ఈ మూవీ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది.

ఇప్ప‌టికే మూవీ నుంచి వచ్చిన మోషన్ పోస్టర్‌ కు మంచి స్పందన లభించింది. ఈ హై బడ్జెట్ యాక్షన్ మూవీని క్యూబ్స్ ఎంటర్‌టైనర్ బ్యాన‌ర్‌పై షరీఫ్ మహ్మద్ (Shareef Muhammed) అబ్దుల్ గదాఫ్ (Abdul Gadhaf) నిర్మిస్తుండ‌గా.. ప్రేమ‌మ్ సినిమా హీరో నివిన్ పాలీ కీ రోల్ ప్లే చేస్తున్నారు. కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బసూర్ (RaviBasrur) ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.


తాజాగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి ఆదరణ లభిస్తోంది. రక్తపు మరకలతో సీరియస్ లుక్ లో కత్తిని పట్టుకొని ఉన్ని ముకుందన్ (Unni Mukundan)లుక్ టెర్రిఫిక్‌గా ఉంది. ఈ పోస్టర్ చూస్తుంటే సినిమా ఎలా ఉండబోతోందో ఒక అంచనాకు వస్తున్నారు ప్రేక్షకులు. త్వరలో ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసి సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు మేకర్స్ తెలిపారు.

Updated Date - Jun 17 , 2024 | 12:23 PM