Maharaja: ‘మహారాజ’ చేజారడానికి.. నా తండ్రి కారణం కాదు

ABN, Publish Date - Aug 25 , 2024 | 11:35 AM

‘మహారాజ’ వంటి ఓ మంచి కథ చేజారిపోవడానికి తన తండ్రి, సీనియర్‌ దర్శక నటుడు కె.భాగ్యరాజ్ కారణం కాదని హీరో శాంతను స్పష్టం చేశారు.

bhagyaraj

‘మహారాజ’ (Maharaja) వంటి ఓ మంచి కథ చేజారిపోవడానికి తన తండ్రి, సీనియర్‌ దర్శక నటుడు కె.భాగ్యరాజ్ (Bhagyaraj) కారణం కాదని హీరో శాంతను (Shanthanu) స్పష్టం చేశారు. ఈ స్టోరీని దర్శకుడు నితిలన్‌ స్వామినాథన్ (Nithilan Swaminathan) ముందుగా తనకే వినిపించారనీ, ఈ కథను పలువురు నిర్మాతలకు వినిపించగా ఏ ఒక్కరూ సాహసం చేయలేదన్నారు.

నితిలన్‌ స్వామినాథన్‌ దర్శకత్వంలో విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) నటించిన ‘మహారాజ’ చిత్రం సూపర్‌హిట్‌ కావడంతో పాటు రూ.100 కోట్లకు పైగా వసూళ్ళు సాధించింది. ఓటీటీలో విడుదలై ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ పొందుతూ, ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో ఒక మంచి సినిమాలో నటించే అవకాశాన్ని శాంతను కోల్పోయారంటూ ఆయన అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు.


వీటిపై హీరో శాంతను (Shanthanu)స్పందించారు. ‘కథల ఎంపికలో నాన్న జోక్యం చేసుకోవడం లేదు. ఇప్పటివరకు నేను కరెక్టుగానే స్టోరీలను ఎంపిక చేసుకుంటున్నాను. ‘మహారాజ’ (Maharaja) కథతో సినిమా తీసేందుకు ఏ ఒక్క నిర్మాత రిస్క్‌ చేయలేదు. అంతేకానీ నాన్న జోక్యం చేసుకోవడం వల్ల ఆ సినిమా చేజారిందన్న ప్రచారంలో వాస్తవం లేదు’ అని శాంతను స్పష్టం చేశారు.

Updated Date - Aug 25 , 2024 | 11:35 AM