మోహన్ దర్శకత్వంలో రిచర్డ్ రిషి.. ముచ్చటగా మూడోసారి హిట్ కాంబినేషన్
ABN, Publish Date - Aug 07 , 2024 | 02:39 PM
2020లో ‘ద్రౌపది’ సినిమాతో యావత్ తమిళ చిత్ర పరిశ్రమను తన వైపు చూసేలా చేసిన దర్శకుడు మోహన్ జి క్షత్రియన్. ఇపుడు తన మూడో ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు. గతంలో తెలుగులో హీరోగా, విలన్గా నటించిన రిచర్డ్ రిషి మరోసారి ఈ సినిమాలో హీరోగా చేయనున్నాడు.
2020లో వచ్చిన ‘ద్రౌపది’ (Draupathi) సినిమాతో యావత్ తమిళ చిత్రపరిశ్రమను తన వైపు చూసేలా చేసిన దర్శకుడు మోహన్ జి క్షత్రియన్ (Mohan G Kshatriyan). ఈ సినిమా కంటే ముందు 2016లో వచ్చిన ‘పళయ వణ్ణారపేట’ (Pazhaya Vannarapettai) సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఇపుడు తన మూడో ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు. ఇందులో గతంలో తెలుగులో పలు సినిమాల్లో హీరోగా, విలన్గా నటించిన రిచర్డ్ రిషి (Richard Rishi) ప్రధాన పాత్ర పోషించనున్నాడు.
గతంలో మోహన్ తెరకెక్కించిన ‘ద్రౌపది’(Draupathi) తో పాటు ‘రుద్రతాండవం’ (Rudra Thandavam) సినిమాల్లో రిచర్డ్ రిషి (Richard Rishi) నటించిన విషయం తెల్సిందే. ఇపుడు మరోమారు దర్శకుడు మోహన్ (Mohan G Kshatriyan) తో కలిసి పని చేయనున్నారు. ఈ విషయాన్ని మోహన్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.
‘ఆడిపెరుక్కు శుభతరుణాన్ని పురస్కరించుకుని కొత్త ఆఫీసులో పూజా కార్యక్రమంతో తదుపరి ప్రాజెక్టుకు సంబంధించిన పనులు ప్రారంభించాం. ఈ విషయాన్ని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఎప్పటి లాగే మీ ప్రేమ, మద్దతు కోసం ఎదురు చూస్తున్నాను’ అని పేర్కొన్నారు.