Jayam Ravi: జయం రవి దర్శకత్వం.. యోగిబాబు హీరో! భ‌లే కాంబినేష‌న్‌

ABN, Publish Date - Oct 20 , 2024 | 08:00 PM

ఓ ఆస‌క్తిక‌ర‌మైన కాంబినేష‌న్‌కు తెర లేసింది. త‌మిళ ఆగ్ర న‌టుడు జ‌యం ర‌వి ద‌ర్శ‌కుడిగా మారుతున్న‌ట్లు త‌మిళ‌నాట వార్త‌లు బాగా హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి.

ఓ ఆస‌క్తిక‌ర‌మైన కాంబినేష‌న్‌కు తెర లేసింది. త‌మిళ ఆగ్ర న‌టుడు జ‌యం ర‌వి (Jayam Ravi) ద‌ర్శ‌కుడిగా మారుతున్న‌ట్లు త‌మిళ‌నాట వార్త‌లు బాగా హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. ఈ సినిమాలో ప్ర‌ముఖ క‌మెడియ‌న్ యోగిబాబు (Yogi Babu) హీరోగా న‌టించ‌నున్న‌ట్లు స‌మాచారం.

ప్ర‌స్తుతం జ‌యం ర‌వి, ప్రియాంకా మోహ‌న్ (Priyanka Mohan) జంట‌గా న‌టించిన చిత్రం బ్ర‌ద‌ర్ (Brother) దీపావ‌ళి సంద‌ర్భంగా మ‌రో వారం రోజుల్లో థియేట‌ర్ల‌లోకి రానుండ‌గా ఆ త‌ర్వాత ఓ నాలుగైదు ఇంట్రెస్టింగ్ కాంబినేస‌న్‌లు జ‌యం ర‌వి లిస్టులో ఉన్నాయి. అవి పూర్త‌య్యాక వ‌చ్చే సంక్రాంతికి గానీ ఉగాదికి గాని జ‌యం ర‌వి ద‌ర్శ‌కుడిగా తెర‌కెక్కించే సినిమా ప‌ట్టాలెక్క‌నున్న‌ట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ఇదిలాఉండ‌గా జ‌యం ర‌వి (Jayam Ravi) కార్తీక్‌ సుబ్బరాజ్‌( Karthik Subbaraj ) దర్శకత్వంలో హీరో జయం రవి నటించనున్నట్టు కోలీవుడ్‌ సమాచారం. ఈ విషయంపై సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. జయం రవి(Jayam Ravi)కి కొన్ని కథలు వినిపించగా, వాటిలో ఒక దాన్ని ఖరారు చేసి ఈ ప్రాజెక్టుపై త్వ‌ర‌లోనే ఓ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు సమాచారం. ప్ర‌స్తుతం జ‌యం ర‌వి (Jayam Ravi) ‘జీనీ’, ‘కాదలిక్క నేరమిల్లై’ చిత్రాలు పూర్తి చేసిన తర్వాత దర్శకుడు గణేష్ బాబు దర్శకత్వంలో ఓ చిత్రంపై, వెట్రిమార‌న్‌తో చిత్రాలు ఉన్నాయి.

Updated Date - Oct 20 , 2024 | 08:15 PM