Harish Kalyan: ‘లబ్బర్ బంతు’తో ఆ రెండు తీరాయి
ABN, Publish Date - Sep 11 , 2024 | 09:07 AM
‘లబ్బర్ బంతు’ సినిమాతో గ్రామీణ యువకుడిగా, క్రీడా నేపథ్యం ఉన్న సినిమాలో నటించాలన్న రెండు కోరికలు ఒకేసారి తీరాయని హీరో హరీష్ కళ్యాణ్ అన్నారు.
‘లబ్బర్ బంతు’ (Lubber Pandhu) సినిమాతో గ్రామీణ యువకుడిగా, క్రీడా నేపథ్యం ఉన్న సినిమాలో నటించాలన్న రెండు కోరికలు ఒకేసారి తీరాయని హీరో హరీష్ కళ్యాణ్ (Harish Kalyan) అన్నారు. కథా రచయిత తమిళరసన్ పచ్చముత్తు (Tamizharasan Pachamuthu) దర్శకుడిగా పరిచయమవుతూ రూపొందించిన ఈ చిత్రంలో హరీష్ కళ్యాణ్, అట్టకత్తి దినేష్ ప్రధాన పాత్రలు పోషించారు.
ఈ సినిమా గురించి హీరో హరీష్ కళ్యాణ్ (Harish Kalyan) మాట్లాడుతూ, ‘స్టోరీ వినగానే ఈ ప్రాజెక్టులోకి అడుగుపెట్టిన తొలి నటుడిని నేనే. ఇప్పటివరకు నగరవాసిగానే నటించాను. ఒక క్రీడా నేపథ్యం ఉన్న చిత్రం, గ్రామీణ యువకుడిగా నటించాలన్న కోరిక ఎప్పటి నుంచో ఉంది. ఈ కథలో ఈ రెండు ఉన్నాయి. అందుకే మరో ఆలోచన లేకుండా ఒకే చెప్పేశాను.
కథ సాగే గ్రామం, అక్కడి ప్రజలు, క్రికెట్ పైత్యంతో వీధుల్లో తిరిగే ఒక యువకుడు, స్టోరీని దర్శకుడు నరేట్ చేసిన విధానం ఇలా ప్రతి అంశం ఎంతగానో ఆకట్టుకుంది. క్రికెట్ నేపథ్యంలో ఈ స్క్రిప్టు కొనసాగినప్పటికీ దానిచుట్టూ తిరిగే ఇతర పాత్రలకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. అందుకే క్రికెట్ నేపథ్యంలో గతంలో వచ్చిన చిత్రాలకు ఇది పూర్తి భిన్నంగా, వైవిధ్యభరితంగా ఉంటుంది’ అని పేర్కొన్నారు.