Arjun: యాక్షన్‌, ఫ్యామిలీ సెంటిమెంట్‌తో అర్జున్‌ ‘విరుందు’

ABN, Publish Date - Sep 02 , 2024 | 04:17 PM

యాక్షన్‌ కింగ్‌ అర్జున్ స్వల్ప విరామం తర్వాత హీరోగా మళ్ళీ వెండి తెరపై సందడి చేశారు. ఆయన నటించిన కొత్త చిత్రం ‘విరుందు’ ఇటీవ‌ల‌ త‌మిళ‌నాట‌ విడుదలైంది.

arjun

యాక్షన్‌ కింగ్‌ అర్జున్ (Arjun Sarja) స్వల్ప విరామం తర్వాత హీరోగా మళ్ళీ వెండి తెరపై సందడి చేశారు. ఆయన నటించిన కొత్త చిత్రం ‘విరుందు’(Virundhu) ఇటీవ‌ల‌ త‌మిళ‌నాట‌ విడుదలైంది. పూర్తి యాక్షన్‌, ఫ్యామిలీ సెంటిమెంట్‌ చిత్రంగా రూపొందించిన ఈ చిత్రంలో అర్జున్‌ మరోమారు త‌న‌ అద్భుతమైన న‌ట‌న‌తో ఆలరించాడు.

నెయ్యర్‌ ఫిలిమ్స్‌ పతాకంపై క్రిష్‌ నెయ్యర్‌ నిర్మాణ సారధ్యంలో రూపొందిన‌ ఈ సినిమా గురించి దర్శకుడు కన్నన్‌ తామర (Kannan Thamarakkulam) మాట్లాడుతూ, ‘ఈ మూవీలో హీరోయిన్‌ తల్లిదండ్రులు అనుమానాస్పదరీతిలో చనిపోతారు.. ఆపై హీరోయిన్‌ను వెంబడించే హంతకులు.. ఇత‌ర‌త్రా ఆసక్తికరమైన క‌థ‌క‌థ‌నాల‌తో ఎంతో ఉత్కంఠ క‌లిగించే స్క్రీన్‌ప్లేతో రూపొందించారు.

అర్జున్‌తో పాటు గిరీష్‌ నెయ్యర్‌, (Gireesh Neyyar) నిక్కీ గల్రానీ (Nikki Galrani), హరీష్‌ పేరడీ, సోనా నాయర్‌, అజు వర్గీస్‌ తదితరులు నటించారు. సినిమా మొత్తం యాక్షన్‌, ఫ్యామిలీ సెంటిమెంట్‌, థ్రిల్లర్‌ తరహాలో సాగుతుంది. విడుదలైన అన్ని థియేటర్లలో మొదటి ఆట నుంచే మంచి స్పందన వస్తున్నట్టు వివరించారు.

Updated Date - Sep 02 , 2024 | 04:17 PM