డిసెంబరులో.. 22వ చెన్నై ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌

ABN, Publish Date - Aug 27 , 2024 | 05:36 AM

తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఇండో సినీ అప్రిసియేషన్‌ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 22వ చెన్నై ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్ వేడుక‌కు రంగం సిద్ధ‌మైంది.

cff

తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఇండో సినీ అప్రిసియేషన్‌ ఫౌండేషన్ (Indo Cine Appreciation Foundation) ఆధ్వర్యంలో 22వ చెన్నై ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్ (Chennai International Film Festival) వేడుక‌కు రంగం సిద్ధ‌మైంది. డిసెంబరు 12 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించే ఈ చిత్రోత్సవంలో ప్రదర్శించే చిత్రాల కోసం ఎంట్రీలను నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు.

ఇందులో తమిళ చిత్రాలతో పాటు వివిధ భాషలకు చెందిన ప్రాం తీయ చిత్రాలు, విదేశీ చిత్రాల విభాగంలో 10 సినిమాలతో పాటు కాన్స్‌, బెర్లిన్‌, వెనిస్‌ తదితర ఇంటర్నేషనల్‌ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైన ఉత్తమ చిత్రాలను కూడా ఇక్కడ ప్రదర్శించనున్నారు. ఈ విషయంపై ఆ చిత్రోత్సవాల కమిటీ పత్రికా ప్రకటన విడుదల చేసింది.


2023 అక్టోబరు 13 నుంచి 2024 అక్టోబరు 15వ తేదీ వరకు విడుదలయ్యే చిత్రాలకు ఎలాంటి ఎంట్రీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా ‘చెన్నై ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌‘కు తమ ఎంట్రీలను రిజిస్టర్‌ చేసుకోవచ్చన్నారు. ఎంట్రీలను నవంబరు 2వ తేదీలోపు సమర్పించాల్సి ఉంటుందని, పాల్గొనదలచిన వారు ఆన్‌లైన్‌లోనే రిజిస్టర్‌ చేసుకుని, ఆన్‌లైన్‌లోనే అడ్మిట్‌ కార్డులను పొందాల్సి ఉంటుంది’ అని పేర్కొన్నారు.

Updated Date - Aug 27 , 2024 | 05:36 AM