స్రవంతి చొక్కరపు అందమైన తెలుగమ్మాయి. అనంతపురం జిల్లా కదిరిలో పుట్టి పెరిగింది. మహంకాళి సినిమాతో నటిగా అరంగేట్రం చేసింది. పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని. నటిగా, యాంకర్ గా, హోస్టుగా అనేక పాత్రలు పోషిస్తూ ప్రశాంత్ అనే అబ్బాయిని ప్రేమించి పెళ్లిచేసుకుంది. తన కుమారుడికి అకిరా నందన్ అని పేరు పెట్టుకుంది. స్వంతంగా బోటిక్ నడుపుకుంటోంది స్రవంతి.