బుల్లితెరపై పార్వతి దేవిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న సోనారిక తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. మంచు విష్ణు సరసన ‘ఈడో రకం ఆడో రకం’, నాగశౌర్య సరసన ‘జాదుగాడు’ చిత్రాలలో నటించిన సోనారిక.. ఆ తర్వాత టాలీవుడ్‌కు బై బై చెప్పేసింది. ప్రస్తుతం తన ప్రియుడు వికాస్ పరాశర్‌ను వివాహం చేసుకుని..కొత్త జీవితాన్ని ప్రారంభించింది.