స్టార్ సింగర్ గీతామాధురి (Geetha Madhuri) మరోసారి తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమెకు కుటుంబ సభ్యులు సీమంతం వేడుకను నిర్వహించారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసిన పలువురు సినీ ప్రముఖులు, సింగర్స్, నెటిజన్లు.. గీతామాధురి, నందు దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు.