దక్షిణ గోవాలోని ఐటీసీ గ్రాండ్ రిసార్టులో రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ వివాహ వేడుక వైభవంగా జరిగింది. రకుల్, జాకీ కుటుంబాల నుండి అత్యంత సన్నిహితులు ఈ పెళ్లికి హాజరవగా.. శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా, ఆయుష్మాన్ ఖురానీ, అర్జున్ కపూర్, డేవిడ్ ధావన్‌తో పాటు బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ సెలబ్రిటీలెందరో ఈ వివాహ వేడుకలో సందడి చేశారు.