రకుల్ ప్రీత్ సింగ్ ఈమధ్యనే తన ప్రియుడు జాకీ భగ్నానీ ని వివాహం చేసుకుంది. గోవాలో పెళ్లి చేసుకున్నాక, ఈ కొత్తగా పెళ్ళైన జనతా ఆ తరువాత హనీమూన్ కి ఎక్కడకి వెళ్లకుండా ఇండియాలోనే వుంది. రకుల్ తన సామాజిక మాధ్యమంలో ఎప్పుడూ చాలా చురుకుగా ఉంటూ తాజా ఫోటోలని పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా అలాగే కొన్ని ఫోటోస్ పోస్ట్ చేసింది. అందులో ఆమె ధరించిన షూస్ దగ్గర నుండి, చెవి రింగుల వరకు, బ్యాగ్, వేసుకున్న బట్టలు అన్నీ కూడా డిజైనర్ కి సంబంధించినవే.