'గంగోత్రి' సినిమాతో బాలనటిగా తెలుగు చిత్ర పరిశ్రమలో అరంగేట్రం చేసిన కావ్య కళ్యాణ్ రామ్ బాలనటిగా మంచిపేరు తెచ్చుకుంది. ఆ సినిమాలో ‘వల్లంకి పిట్టా వల్లంకి పిట్టా మెల్లంగ రమ్మంటా’ అనే పాటలో ఆమె నటనని అందరూ ప్రశంసించారు. తరువాత బాలనటిగా చాలా చిత్రాలలో నటించిన కావ్య న్యాయశాస్త్రంలో పట్టభద్రురాలయింది. 'మాసూద' అనే హర్రర్ సినిమాతో కథానాయకురాలిగా ఆరంగేట్రం చేసి, రెండో సినిమా 'బలగం'తో మంచి పేరు తెచ్చుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి కుమారుడు శ్రీ సింహ కథానాయకుడిగా వచ్చిన 'ఉస్తాద్' లో కథానాయికగా నటించింది.