Gyaarah Gyaarah OTT: తెలుగులోనూ వ‌చ్చేసిన‌.. అదిరిపోయే ఇన్వెస్టిగేష‌న్‌ థ్రిల్ల‌ర్!డోంట్ మిస్‌

ABN, Publish Date - Sep 22 , 2024 | 12:21 PM

ఇటీవ‌ల ఓటీటీకి వ‌చ్చి వీక్ష‌కుల‌ను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతూ అద‌రిపోయే థ్రిల్‌ను ఇస్తోన్న ఫాంట‌సీ ఇన్వెస్టిగేష‌న్‌ థ్రిల్ల‌ర్ సిరీస్ గ్యారా గ్యారా ఇప్పుడు తెలుగు భాష‌లోనూ అందుబాటులోకి వ‌చ్చింది.

Gyaarah Gyaarah

ఇటీవ‌ల ఓటీటీకి వ‌చ్చి సంచ‌ల‌నం సృష్టిస్తోన్న ఫాంట‌సీ ఇన్వెస్టిగేష‌న్‌ థ్రిల్ల‌ర్ సిరీస్ గ్యారా గ్యారా (Gyaarah Gyaarah) వీక్ష‌కుల‌ను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతూ అద‌రిపోయే థ్రిల్‌ను ఇస్తోంది. 2016లో కొరియాలో వ‌చ్చిన ఫేమ‌స్ సిరీస్ ‘సిగ్న‌ల్’ ఆధారంగా హిందీలో రూపొందించి ఆగ‌స్టు 9 నుంచి జీ5 ఓటీటీలో డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు తీసుకు వ‌చ్చారు. అయితే మొద‌ట కేవ‌లం హిందీలో మాత్ర‌మే అందుబాటులోకి రావ‌డంతో సౌత్ ప్రేక్ష‌కులు బాగా నిరాశ చెందిన‌ప్ప‌టికీ కొద్ది మంది హిందీలోనే చూసి ఆస్వాధించారు. తాజాగా ఈ ఆదివారం నుంచి తెలుగు, త‌మిళ భాష‌ల్లోకి ఈ సిరీస్‌ను తీసుక‌వ‌చ్చారు దీంతో ద‌క్షిణాది ప్ర‌జ‌లు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. కిల్ సినిమాలో ప్ర‌తినాయ‌కుడిగా మెప్పించిన‌ రాఘ‌వ్ జుయ‌ల్ (Raghav Juyal) మెయిన్ లీడ్‌గా న‌టించ‌గా కృతిక కమ్రా (Kritika Kamra), ధైర్య కర్వా (Dhairya Karwa), ఆకాష్ దీక్షిత్ (Aakash Dixit), ముక్తి మోహన్ (Mukti Mohan) కీల‌క పాత్ర‌లు పోషించారు. ఉమేశ్ బిస్ట్ (Umesh Bist) ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

క‌థ విష‌యానికి వ‌స్తే.. 1990, 2001, 2016 టైం లైన్ల‌లో ఉత్తరాఖాండ్ రాష్ట్రంలో జ‌రిగే క్రైమ్స్‌, ఇన్వెస్టిగేష‌న్ సీరియ‌ల్ మ‌ర్డ‌ర్స్‌ నేప‌థ్యంలో మూడు స్టోరీల చుట్టూ ఈ సిరీస్ ఉంటుంది.. సిరీస్ 2016లో ప్రారంభం అవుతుంది. అప్ప‌టికీ 15 ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న ఓ బాలిక మిస్సింగ్ కేసు గురించి సంబంధిత ఫ్యామిలీ, వారికి మ‌ద్ద‌తుగా చాలామంది ప‌బ్లిక్ పోరాటం చేస్తుంటారు. అదే స‌మ‌యంలో యుగ్ ఆర్య పోలీస్ ఇన‌స్పెక్ట‌ర్‌గా కొత్త‌గా విధుల్లో చేరుతాడు. అయితే ఓ రోజు రాత్రి స‌రిగ్గా 11.11 గంట‌ల‌కు ఆయ‌న ద‌గ్గ‌ర ఉండే వాకీ టాకీకి.. డిఫ‌రెంట్ టైమ్‌లైన్‌లో(1990 సంవ‌త్స‌రం నుంచి) అప్పుడు ఇన్‌స్పెక్ట‌ర్‌గా ఉన్న‌ శౌర్య వాకీ టాకీ నుంచి ఓ ఫోన్ వ‌చ్చి బాలిక‌ మిస్సింగ్ కేసుకు సంబంధించిన వివ‌రాలు చెబుతాడు. దీంతో యుగ్ కొన్ని రోజుల త‌ర్వాత ఆ కేసును చేధిస్తాడు. అస‌లు బాలికను ఎవ‌రు కిడ్నాప్ చేశారు, ఆ కిల్ల‌ర్ ఎవ‌రు, యుగ్‌కు ఆ కేసుకు ఉన్న లింక్ ఏంటి, ఈ క్ర‌మంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర‌య్యాయ‌నేది విష‌యాన్ని ప్ర‌తి నిమిషం గూస్ బంప్స్ వ‌చ్చేలా రూపొందించారు.


అయితే వారు మాట్లాడుకునే టైమ్‌లైన్లు వేరు అనే సంగ‌తి వారికి చాలా రోజుల వ‌ర‌కు తెలియ‌దు. వారు మాట్లాడుకోవ‌డానికి కేవ‌లం ఒక్క నిమిషం మాత్ర‌మే స‌మ‌యం ఉంటుంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌జెంట్‌లో ఉన్న యుగ్.. ఫాస్ట్‌లో ఉన్న శౌర్య ఇద్ద‌రు పెండింగ్ కేసులకు సంబంధించిన చిన్న‌చిన్న లీడ్స్ తీసుకుని కేసుల‌ను ప‌రిశోధిస్తుంటారు. మొద‌ట 1990 నుంచి శౌర్య ఇచ్చిన లీడ్‌తో 15 ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న బాలిక కిడ్నాప్‌, మ‌ర్డ‌ర్ కేసును 2016లో యుగ్ ఆర్య సాల్వ్‌ చేస్తాడు. ఇక ఆ త‌ర్వాత‌ 2016లో యుగ్ అర్య నుంచి లీడ్ తీసుకుని 1998, 2001 సంత్స‌రాల్లో శౌర్య‌ కేసులు ఇన్వెస్టిగేష‌న్ చేయ‌గా అప్పుడు జ‌రిగే మార్పుల వ‌ళ్ల‌ భ‌విష్య‌త్తులో 2016లో యుగ్ ఆర్య‌ ఇన్వెస్టిగేట్ చేసే కేసుల‌లో భారీ మార్పులు చోటు చేసుకుంటాయి. కొత్త ప్ర‌మాదాల‌కు కూడా దారి తీస్తాయి. దీంతో శౌర్య‌, యుగ్ అర్యలు వారి టైమ్‌లైన్ల‌లో అనేక స‌మ‌స్య‌లు ఉత్ప‌న్న‌మ‌వ‌డంతో పాటు వారి పై ఆఫీస‌ర్ల నుంచి తీవ్ర ప్ర‌తిఘ‌ట‌న‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

ఈ క్ర‌మంలో ఏసీపీ వామికా పాత్ర ఏంటి, ఆమెకు శౌర్య‌కు ఉన్న సంబంధం ఏంటి, శౌర్య పాస్ట్‌లో త‌న‌ ప్రేయ‌సిని ఎందుకు బ‌తికించులేక పోయాడు, చివ‌ర‌కు వారు త‌మ కేసుల‌ను చేధించ‌గ‌లిగారా లేదా అస‌లేమైంది అనే ఇంట్రెస్టింగ్ క‌థాక‌థనాల‌తో సిరీస్ ఆద్యంతం సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతుంది. టోట‌ల్‌గా 8 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ ఎక్క‌డా బోర్ కొట్టదు పైగా నెక్ట్స్ ఏం జ‌రుగ‌బోతుంద‌నే సస్పెన్స్‌తో పిచ్చెక్కిస్తుంది. అయితే ఇప్పుడు ఈ సిరీస్ జీ5లో హిందీతో పాటు తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది కాబ‌ట్టి మంచి థ్రిల్ల‌ర్స్‌, ఫాంట‌సీలు ఇష్ట‌ప‌డే వారు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఈ గ్యారా గ్యారా (Gyaarah Gyaarah) సిరీస్‌ను మిస్ అవ‌కుండా చూసి ఓ వెరైటీ థ్రిల్ల‌ర్‌ను ఫీల‌వ్వండి..

Updated Date - Sep 22 , 2024 | 12:21 PM