మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Gaami: స్నో కింగ్‌డమ్‌లో.. ఇదే ఫస్ట్ టైమ్.. జీ5లోకి వచ్చేసిన ‘గామి’

ABN, Publish Date - Apr 12 , 2024 | 01:48 PM

విశ్వక్ సేన్, చాందినీ చౌదని హీరో హీరోయిన్లుగా విద్యాధర్ కాగిత దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గామి’. కార్తిక్ శబరీష్ నిర్మాతగా వచ్చిన ఈ మూవీకి నరేష్ కుమరన్ సంగీతాన్ని అందించారు. మార్చి 8న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఏప్రిల్ 12 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ స్నో కింగ్‌డమ్‌లో మీడియాతో ముచ్చటించింది. స్నో కింగ్‌డమ్‌లో ప్రెస్ మీట్ నిర్వహించటం ఇండియాలోనే ఇదే తొలిసారి.

Gaami Press Meet at Snow Kingdom

విశ్వక్ సేన్ (Vishwak Sen), చాందినీ చౌదని (Chandini Chowdary) హీరో హీరోయిన్లుగా విద్యాధర్ కాగిత (Vidyadhar Kagita) దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గామి’ (Gaami). కార్తిక్ శబరీష్ నిర్మాతగా వచ్చిన ఈ మూవీకి నరేష్ కుమరన్ (Naresh Kumaran) సంగీతాన్ని అందించారు. మార్చి 8న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఏప్రిల్ 12 నుంచి జీ5 ఓటీటీ (Zee5)లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ స్నో కింగ్‌డమ్‌ (Snow Kingdom)లో మీడియాతో ముచ్చటించింది. స్నో కింగ్‌డమ్‌లో ప్రెస్ మీట్ నిర్వహించటం ఇండియాలోనే ఇదే తొలిసారి. దీంతో మరోసారి ఈ సినిమా వార్తలలో హైలెట్ అవుతోంది.

*Mahesh Babu: యూరప్‌ ట్రిప్‌ ఫొటోలు వైరల్‌.. అందులో ఏముందంటే!


ఈ కార్యక్రమంలో హీరో విశ్వక్ సేన్ (Hero Vishwak Sen) మాట్లాడుతూ.. ఇంత తక్కువ ఉష్ణోగ్రతలో ఇలా స్నో కింగ్‌డమ్‌లో నిర్వహించాలనే ఐడియా అంతా కూడా జీ5 టీమ్‌దే. ఇలాంటి ఐడియా నాకు ఎందుకు రాలేదని అనుకుంటున్నాను. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని కూడా ఇలా చలిలోనే చేసేవాడ్ని. గామిలాంటి సినిమాలకు మామూలుగా అవార్డులు, ప్రశంసలు వస్తుంటాయి.. కలెక్షన్లు రావని అంతా అనుకుంటారు. కానీ ఇది నా కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్, కలెక్షన్లను సాధించింది. గామిలో కమర్షియల్ అంశాలేవీ ఉండవు. అయినా ఆడియెన్స్ చాలా బాగా ఆదరించారు. వారణాసిలోని ఘాట్‌లో శవాలు కాలుతున్నా కూడా ఓ 20 నిమిషాలు షూట్ చేశాం. చావుని వాళ్లు సెలెబ్రేట్ చేసుకున్నారు. అప్పుడు నాకు జీవితం చాలా చిన్నది అనిపించింది. ఇలాంటి కథను నమ్మాలి. నాకు పెద్ద రిస్క్ అనిపించలేదు. ఓ ఫ్లాప్ సినిమాను తీయడం కంటే.. ఇలాంటి కథను నమ్మడం బెటర్. ‘గామి’ని థియేటర్లో అందరూ చూశారు. మాకు మంచి రివ్యూలు ఇచ్చారు. ఏప్రిల్ 12 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఓటీటీలోనూ మా చిత్రాన్ని ఆదరించాలని కోరుతున్నానని అన్నారు. (Gaami Streaming Started in Zee5)


డైరెక్టర్ విద్యాధర్ కాగిత మాట్లాడుతూ.. థియేటర్లో మా సినిమా కొంత మందికి అర్థం కాలేదనే కంప్లయింట్స్ వచ్చాయ్. ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. మూడు నాలుగు సార్లు చూస్తే మా థీమ్ ఏంటి? మా కాన్సెప్ట్ ఏంటి? అన్నది అందరికీ ఈజీగా అర్థం అవుతుంది. మేం ఎప్పుడూ ఈ సినిమా కోసం లెక్కలు వేసుకోలేదు. చిన్నా, పెద్దా.. బడ్జెట్ అంటూ ఇలా లెక్కలేసుకుండా సినిమా తీశాం. జీ5లో ఏప్రిల్ 12 నుంచి ‘గామి’ స్ట్రీమింగ్ అవుతుంది.. అందరూ వీక్షించండని కోరారు.

లాయిడ్ జేవియర్ (Loyd Xavier) (జీ 5 సౌత్, వైస్ ప్రెసిడెంట్ - మార్కెటింగ్) మాట్లాడుతూ.. ‘గామి’లాంటి మంచి చిత్రాన్ని తీసిన విద్యాధర్, విశ్వక్ సేన్‌లకు థాంక్స్. ఈ రోజు ఇలా వినూత్నంగా ఆలోచించి ఈవెంట్‌ను నిర్వహించాం. స్నో కింగ్‌డమ్‌లో ప్రెస్ మీట్ నిర్వహించటం ఇండియాలోనే ఇదే తొలిసారి. అందరూ ఎంజాయ్ చేసుంటారని భావిస్తున్నాం. చాలా కొత్తగా ఉంటుందని ఇలా స్నో కింగ్‌డమ్‌లో ఈవెంట్ పెట్టాం. ఏప్రిల్ 12 నుంచి తెలుగు, తమిళ్, కన్నడలో జీ5లో గామి స్ట్రీమింగ్ అవుతోంది. అందరూ వీక్షించండి. 2024లో వచ్చిన బెస్ట్ మూవీస్‌లో ఇదొకటని తెలిపారు.


ఇవి కూడా చదవండి:

====================

*Manjummel Boys: తెలుగు వెర్షన్ ప్రదర్శనలను నిలిపేసిన పీవీఆర్ మల్టిఫ్లెక్స్

**********************

*Aa Okkati Adakku: ‘ఆ ఒక్కటి అడక్కు’ తెలుగు రాష్ట్రాల హక్కులు ఎవరికంటే..

****************************

*Devara: ‘లైగర్’ నిర్మాత చేతికి ‘దేవర’.. ఆ చిక్కులు తప్పవా!

*********************

Updated Date - Apr 12 , 2024 | 01:59 PM