Hanuman OTT: ఏందయ్యా ఇది.. ఈ ఊరించడమేంటి? ఇంట్రెస్ట్ పోతోంది..
ABN, Publish Date - Mar 15 , 2024 | 10:54 AM
ఈ సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చి.. బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం ‘హనుమాన్’. సినిమా విడుదలై 50 రోజులు పూర్తయినా.. ఇంకా ఈ సినిమా ఓటీటీలో విడుదల కాలేదు. ఓటీటీ రైట్స్ సొంతం చేసుకున్న జీ5తో పాటు మేకర్స్ కూడా ఇదిగో, అదిగో అంటున్నారు కానీ.. ఇంత వరకు రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించలేదు. తాజాగా జీ5 ఓటీటీ సంస్థ.. ‘హనుమాన్’ ఓటీటీ విడుదలపై ‘అతి త్వరలో’ అంటూ చేసిన ట్వీట్.. ఓటీటీ ప్రేక్షకులను మరింతగా డిజప్పాయింట్ చేస్తోంది.
ఈ సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చి.. బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం ‘హనుమాన్’ (Hanuman). సినిమా విడుదలై 50 రోజులు పూర్తయినా.. ఇంకా ఈ సినిమా ఓటీటీలో విడుదల కాలేదు. ఓటీటీ రైట్స్ (OTT Rights) సొంతం చేసుకున్న జీ5 (Zee5)తో పాటు మేకర్స్ కూడా ఇదిగో, అదిగో అంటున్నారు కానీ.. ఇంత వరకు రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించలేదు. తాజాగా జీ5 ఓటీటీ సంస్థ.. ‘హనుమాన్’ ఓటీటీ విడుదల (Hanuman OTT Release)పై చేసిన ట్వీట్.. ఓటీటీ ప్రేక్షకులను మరింతగా డిజప్పాయింట్ చేస్తోంది. ఈ ట్వీట్‌లో ‘హనుమాన్’ తెలుగు వెర్షన్‌కు సంబంధించి అప్‌డేట్ ఇస్తున్నట్లే ఇచ్చి.. మళ్లీ ఊరించే ప్రయత్నం చేశారు.
అతి త్వరలో ‘హనుమాన్’ తెలుగు వెర్షన్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో అంటూ జీ5 సంస్థ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ చూసిన వారంతా మరోసారి నిరుత్సాహానికి గురవుతున్నారు. కారణం.. ఇదే సినిమా హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. ఏయే ప్లాట్‌ఫామ్స్‌లో ఈ సినిమా విడుదల కాబోతుందో.. ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటుందో.. డేట్, టైమ్‌తో సహా ప్రకటించారు. కానీ, హిందీ మినహా ఇతర వెర్షన్స్‌లో మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వకుండా కన్ఫ్యూజ్ చేస్తూనే ఉన్నారు. తెలుగు వెర్షన్ ఓటీటీ విడుదలకు సంబంధించి దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prasanth Varma) కూడా ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌కు కూడా నెటిజన్లు, ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. (Hanuman Telugu OTT Streaming Update)
‘‘హనుమాన్ ఓటీటీ విడుదల ఆలస్యం.. కావాలని చేస్తుంది కాదు. ఈ సినిమాను ఓటీటీలోకి తెచ్చేందుకు అడ్డుగా ఉన్న వాటినన్నింటినీ తొలగించేందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నాము. ది బెస్ట్ ఇవ్వాలనేదే మా ఉద్దేశ్యం. దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పటి వరకు మాకు సపోర్ట్ చేస్తూ వస్తున్న వారందరికీ ధన్యవాదాలు..’’ అని ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ (Prasanth Varma Hanuman) ఓటీటీ విడుదలపై చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు నెటిజన్లు ఆసక్తికరంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇన్నాళ్లు ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్నాం.. కానీ ఈ డిలే చూస్తుంటే సినిమాపై ఆసక్తి పోతోంది అంటూ నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. మరోవైపు ఈ సినిమా కలర్ సినీప్లెక్స్, జియో సినిమాలలో (హిందీ వెర్షన్) మార్చి 16 నుండి స్ట్రీమింగ్ కాబోతోంది.
ఇవి కూడా చదవండి:
====================
*Ritika Singh: తలైవర్‌కు ఎప్పటికీ రుణపడివుంటా..
*******************************
*AM Rathnam: పవన్ కళ్యాణ్‌పై ‘హరిహర వీరమల్లు’ నిర్మాత పోస్ట్ వైరల్
*****************************
*Vishwak Sen: మా సినిమాని కూడా చూసి.. నలుగురు పెద్ద మనుషులు మాట్లాడండి
************************
*Kubera: శేఖర్ కమ్ములతో కింగ్ నాగ్ మంతనాలు.. ఫొటో వైరల్
*****************************