OTTలోకి వచ్చేసిన విశాల్ యాక్షన్ అడ్వెంచర్.. ‘రత్నం’
ABN, Publish Date - May 17 , 2024 | 07:19 AM
ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి మరో డబ్బింగ్ సినిమా వచ్చేసింది. ఏప్రిల్ 26న థియేటర్లలోకి వచ్చి మిశ్రమ స్పందనను రాబట్టుకున్న చిత్రం రత్నం డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి మరో డబ్బింగ్ సినిమా వచ్చేసింది. ఏప్రిల్ 26న థియేటర్లలోకి వచ్చి మిశ్రమ స్పందనను రాబట్టుకున్న చిత్రం రత్నం (Rathnam) డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. విశాల్ (Vishal), ప్రియ భవానీ శంకర్ (PriyaBhavaniShankar) జంటగా నటించగా సింగం వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాల డైరక్టర్ హరి (Hari) దర్శకత్వం వహించారు. అంతకుముందు విశాల్ నటించిన భరణి, పూజ సినిమాల తర్వాత ఇప్పుడు ముచ్చటగా మూడోసారి విశాల్ సినిమాకు హరి దర్శకత్వం చేసి హ్యట్రిక్ కొట్టారు. అంతేగాక ఫస్ట్ టైం విశాల్ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం అందించడం విశేషం.
కథ విషయానికి వస్తే.. తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ బోర్డర్‌లోని ఓ ఎమ్మెల్యే దగ్గర రత్నం (విశాల్) పని చేస్తుంటాడు. ఓ రోజు మల్లిక (ప్రియ భవానీ శంకర్) అనే అమ్మాయిని కొంతమంది రౌడీలు చంపడానికి ప్రయత్నిస్తే కాపాడుతాడు. తర్వాత తమిళ నాడు తిరుత్తరణికి చెందిన లింగం (మురళీ శర్మ) మల్లికని చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని తెలుసుకుని మల్లికకు రక్షణగా ఉంటుంటాడు రత్నం. అసలు లింగం మల్లికను ఎందుకు చంపాలనుకున్నాడు, రత్నం మల్లికకు ఎందుకు కాపాలాగా ఉండాల్సి వచ్చింది, తల్లి రంగనాయకి ఈ గొడవలకు మధ్య ఉన్న సంబంధం చుట్టూ ఈ చిత్రం కథ సాగుతుంది.
అంతేకాదు సినిమా అసాంతం ట్విస్టుల మీద ట్విస్టులు వస్తూ పోరాట ఘట్టాలతో యాక్షన్ ప్రియులకు ఫుల్ మీల్స్ అందిస్తుంది. ఎక్కువగా హింసాత్మక సన్నివేశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ బోల్డ్ సన్నివేశాలు లేనందున కుటుంబతో కలిసి ఈ రత్నం (Rathnam) సినిమాను ఒకసారి చూసేయవచ్చు. మే 24 గురువారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Prime Video)లో తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో మిస్ అయిన వారు ఇంట్లోనే చూసేయవచ్చు.