Viraaji: 56 లక్షల వాచ్ మినిట్స్.. ఓటీటీలో సెన్సేషన్‌గా ‘విరాజి’

ABN , Publish Date - Aug 23 , 2024 | 08:40 PM

వరుణ్ సందేశ్ వైవిధ్యమైన పాత్రలో నటించిన చిత్రం ‘విరాజి’. ఈ చిత్రాన్ని మహా మూవీస్‌తో కలిసి ఎం3 మీడియా బ్యానర్‌పై మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మించగా.. ఆద్యంత హర్ష దర్శకత్వం వహించారు. ఈ నెల 2న థియేటర్స్‌లోకి వచ్చిన ఈ సినిమా మంచి స్పందననే రాబట్టుకుంది. తాజాగా ఈ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ వచ్చి సెన్సేషన్‌ని క్రియేట్ చేస్తోంది.

Viraaji Movie Still

వరుణ్ సందేశ్ (Varun Sandesh) వైవిధ్యమైన పాత్రలో నటించిన చిత్రం ‘విరాజి’ (Viraaji). ఈ చిత్రాన్ని మహా మూవీస్‌తో కలిసి ఎం3 మీడియా బ్యానర్‌పై మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మించగా.. ఆద్యంత హర్ష (Adhyanth Harsha) దర్శకత్వం వహించారు. ఈ నెల 2న థియేటర్స్‌లోకి వచ్చిన ఈ సినిమా మంచి స్పందననే రాబట్టుకుంది. తాజాగా ఈ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ వచ్చి సెన్సేషన్‌ని క్రియేట్ చేస్తోంది. అతి తక్కువ సమయంలోనే 56 లక్షల వాచ్ మినిట్స్‌తో ఆహా యాప్‌లో ఈ సినిమా ట్రెండింగ్‌లో ఉండటంతో మేకర్స్ తమ ఆనందాన్ని తెలియజేశారు.

Also Read- Cinema Review: మారుతీనగర్‌ సుబ్రమణ్యం

ఈ సందర్భంగా నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల (Mahendra Nath Koondla) మాట్లాడుతూ.. ‘విరాజి’ సినిమాను ఈ నెల 2న థియేటర్లలో విడుదల చేశాం. ఆ వారం చాలా సినిమాలు ఉండటం వల్ల ఎక్కువమంది ఆడియెన్స్‌కు మా మూవీ రీచ్ కాలేకపోయింది. అందుకే వీలైనంత త్వరగా ఓటీటీలోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నాం. ఆహాలో మా సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే మా ‘విరాజి’ చిత్రం 56 లక్షల వాచ్ మినిట్స్‌తో ఆహా యాప్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఈ సినిమా విషయంలో హీరో వరుణ్ సందేశ్ ఎంతో సపోర్ట్ చేశారు. ఏమాత్రం యాటిట్యూడ్ లేని పర్సన్ మా హీరో. మంచి చిత్రం అందించిన మా దర్శకుడికి ధన్యవాదాలు అని తెలిపారు. నటుడు వైవా రాఘవ మాట్లాడుతూ.. ఈ సినిమాను థియేటర్స్‌లో ఆదరించిన ప్రేక్షకులకు థ్యాంక్స్. ఈ సినిమాలో నేను చేసిన రోల్‌కు మంచి గుర్తింపు దక్కింది. ఆహాలో మా చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకి ధన్యవాదాలని అన్నారు. మరో నటుడు కాకినాడ నాని మాట్లాడుతూ.. ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేసే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ ఆద్యంత్ హర్ష, నిర్మాత మహేంద్ర నాథ్‌కు థ్యాంక్స్ చెప్పారు. (Varun Sandesh Viraaji in Aha OTT)


Viraaji-Movie.jpg

హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. థియేటర్లలో మిస్సయిన ప్రేక్షకుల కోసం ‘విరాజి’ సినిమాను ఆహా ఓటీటీలోకి తీసుకొచ్చాం. 56 లక్షల వాచ్ మినిట్స్‌తో ఈ సినిమా ట్రెండింగ్‌లో ఉందంటే.. ప్రేక్షకులకు ఈ సినిమా ఎంత నచ్చిందో అర్థమవుతోంది. చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ రోజు మా ప్రొడ్యూసర్ మహేంద్రనాథ్‌ పుట్టినరోజు. సో ఇది ఆయనకు బర్త్ డే గిఫ్ట్ అనుకుంటున్నా. మహేంద్రనాథ్ మా మూవీని అభిరుచితో నిర్మించడమే కాకుండా బాగా ప్రమోట్ చేసి ఆడియెన్స్ దగ్గరకు తీసుకెళ్లారు. ఒక మంచి పాయింట్‌తో డైరెక్టర్ ఆద్యంత్ హర్ష ఈ సినిమాను అందరికీ నచ్చేలా రూపొందించారు. అయితే ఆగస్ట్ 2న థియేటర్స్ మేము అనుకున్నంత స్థాయిలో దొరకలేదు. థియేటర్స్ అందుబాటులో లేక చాలామంది ఈ సినిమాను చూడలేకపోయారు. ఇప్పుడు ఆహాలో అందరూ చూస్తూ సక్సెస్ చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.

Read Latest Cinema News

Updated Date - Aug 23 , 2024 | 08:40 PM