Raid OTT: ఓటీటీకి.. లేటెస్ట్‌ యాక్షన్ థ్రిల్లర్

ABN, Publish Date - Oct 19 , 2024 | 01:36 PM

ఓటీటీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు ఓ త‌మిళ‌ డ‌బ్బింగ్ చిత్రం 'రైడ్' లేటెస్ట్‌గా ఓటీటీకి వ‌చ్చేసింది. శివాజీ గ‌ణేశ‌న్ మ‌నువ‌డు, సీనియ‌ర్ న‌టుడు కుమారుడు విక్ర‌మ్ ప్ర‌భు హీరోగా న‌టించ‌గా మ‌న తెలుగమ్మాయి శ్రీదివ్య క‌థానాయిక‌గా న‌టించింది.

raid

ఓటీటీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు ఓ త‌మిళ‌ డ‌బ్బింగ్ చిత్రం 'రైడ్' (Raid) లేటెస్ట్‌గా ఓటీటీకి వ‌చ్చేసింది. శివాజీ గ‌ణేశ‌న్ మ‌నువ‌డు, సీనియ‌ర్ న‌టుడు కుమారుడు విక్ర‌మ్ ప్ర‌భు (Vikram Prabhu) హీరోగా న‌టించ‌గా మ‌న తెలుగమ్మాయి శ్రీదివ్య (Sri Divya) క‌థానాయిక‌గా న‌టించింది. 2023లో దీపావ‌ళికి త‌మిళ‌నాట విడుద‌లైన ఈ చిత్రం అంత‌గా అద‌ర‌ణ ద‌క్కించుకోలేక పోయింది. స‌రిగ్గా ఏడాది త‌ర్వాత ఇప్పుడు దిపావ‌ళి పండుగ స‌మ‌యానికి తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్‌కు తీసుకు వ‌చ్చారు.

శివ‌రాజ్ కుమార్ హీరోగా 2018లో క‌న్న‌డ‌లో విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించిన త‌గ‌రు సినిమాను త‌మిళంలో రైడ్ అనే పేరుతో రిమేక్ చేయ‌గా గ‌త సంవ‌త్స‌రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి నిరాశ ప‌ర్చింది. కార్తీ (Karthi) ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవ‌గా సామ్ C. S సంగీతం అందించాడు. చెన్నైలో తీవ్ర స‌మ‌స్యగా మారిన దాలి అనే గ్యాంగ్ స్ట‌ర్స్‌ను అంత‌మొదించేందుకు ఇన్‌స్పెక్ట‌ర్ ప్ర‌భాక‌రన్‌ న‌డుం బిగించ‌డం, ఈ క్ర‌మంలో ప్ర‌బాక‌ర‌న్ భార్య మ‌ర‌ణించ‌డం జ‌రుగుతుంది.

దీంతో ఇన్‌స్పెక్ట‌ర్ తిరిగి రివేంజ్ తీసుక‌కునేందుకు వేట మొద‌లు పెట్టి చివ‌ర‌కు అస‌లు గ్యాంగ్‌స్ట‌ర్‌ను అంత‌మొందించాడా లేదా అనే క‌థాంశంతో సినిమా సాగుతుంది. ఈ సినిమా ఈ రోజు (శుక్ర‌వారం) రాత్రి నుంచి ఆహా (#Aha) ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తెలు గు మ్యాడ్ సినిమాలో ఓ క‌థానాయిక‌గా చేసిన అనంతిక సనిల్‌ కుమార్ ఈ మూవీలో కీల‌క పాత్రలో మెప్పించింది. ఈ వీకెండ్ మంచి యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ చూడాల‌నుకునే వారికి ఈ 'రైడ్' (Raid) మూవీ బెస్ట్ ఆఫ్స‌న్‌.

Updated Date - Oct 19 , 2024 | 01:36 PM