Hitler OTT: దేవర దెబ్బ.. డైరెక్టుగా తెలుగులో ఓటీటీకి వచ్చిన విజయ్ అంటోని ‘హిట్లర్’
ABN, Publish Date - Oct 30 , 2024 | 11:07 AM
ఇప్పటికే ఈ సంవత్సరం రోమియో, తుఫాన్ అంటూ రెండు చిత్రాలతో పలకరించిన విజయ్ అంటోని హీరోగా నటించిన ముచ్చటగా మూడో చిత్రం ‘హిట్లర్’ ఇప్పుడు తెలుగులో డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
నిత్యం వైవిధ్యమైన చిత్రాలతో సౌత్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్న నటుడు బిచ్చగాడు ఫేం హీరో విజయ్ ఆంటోనీ (Vijay Antony). ఇప్పటిక ఏఈ సంవత్సరం రోమియో, తుఫాన్ రెండు చిత్రాలతో పలకరించిన విజయ్ ముచ్చటగా మూడో చిత్రం ‘హిట్లర్’ (Hitler) తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రియా సుమన్ (Riya Suman), గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautham Vasudev Menon), చరణ్ రాజ్ (Charan Raj), నరేన్ కీలక పాత్రల్లో నటించారు. గతంలో విజయ్ ఆంటోనీతో ‘విజయ్ రాఘవన్’ అనే మూవీని నిర్మించిన చెందూర్ ఫిల్మ్ (Chendur Film) ఇంటర్నేషనల్ సంస్థ తమ 7వ ప్రాజెక్ట్ గా యాక్షన్ థ్రిల్లర్ కథతో ఈ సినిమాను నిర్మించగా మణిరత్నం శిష్యుడు ధన (Dhana) దర్శకత్వం వహించాడు.
ఇక కథ విషయానికి వస్తే.. మినిస్టర్ మైఖేల్ మనుషులు ఒక్కొక్కరు హత్యకు గురవుతుంటారు ఆపై అతని కోట్ల రూపాయల బ్లాక్ మనీని ఓ అపరిచిత వ్యక్థి తస్కరిస్తాడు. దీంతో ఈ కేసును డిప్యూటీ పోలీస్ కమీషనర్ (గౌతమ్ వాసుదేవమీనన్) ఇన్వేస్టిగేట్ చేయడం మొదలుపెట్టగా సెల్వ వీటికి కారణం అనే నిజం తెలుస్తుంది. ఓ పల్లెటూరి నుంచి చెన్నైసిటీకి వచ్చిన సెల్వ మినిస్టర్‌ను ఎందుకు టార్గెట్ చేశాడు? అతడు ప్రేమించిన అభి ఎవరనే పాయింట్ నేపథ్యంలో ఈ మూవీ సాగుతుంది. అయితే ఈ చిత్రం రొటీన్ సినిమాల్లాగానే సాగడం మైనస్.
గత నెల దసరాకు తమిళనాట థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం మిశ్రమ స్పందనను తెచ్చుకుంది. అదే రోజు మన దగ్గర దేవర చిత్రం రిలీజ్ ఉండడడంతో థియేటర్లు అందుబాటులో లేక తెలుగులో థియేటర్లలో విడుదల కాలేదు. ఆ తర్వాత నెల రోజుల తర్వాత తమిళంలో మాత్రమే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ఇతర సౌత్ భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది. విజయ్ అంటోని (Vijay Antony)ని, యాక్షన్ సినిమాలను ఇష్ట పడే వారు ఈ మూవీని ఒక్కసారి చూసి ఎంజాయ్ చేయవచ్చు.