Utsavam OTT: ‘ఉత్సవం’ ఓటీటీలోకి వచ్చేసింది..

ABN, Publish Date - Oct 12 , 2024 | 11:43 PM

దసరా సందర్భంగా థియేటర్లో, ఓటీటీలో కొత్త చిత్రాల సందడి కనిపిస్తోంది. ఈ క్రమంలో రీసెంట్‌గా వచ్చిన ఎమోషనల్ డ్రామా, సందేశాత్మక చిత్రమైన ‘ఉత్సవం’ ఓటీటీలోకి వచ్చి, మంచి ఆదరణను రాబట్టుకుంటోంది. ఆ వివరాల్లోకి వెళితే..

Utsavam Movie still

దసరా సందర్భంగా థియేటర్లో, ఓటీటీలో కొత్త చిత్రాల సందడి కనిపిస్తోంది. ఈ క్రమంలో రీసెంట్‌గా వచ్చిన ఎమోషనల్ డ్రామా, సందేశాత్మక చిత్రమైన ‘ఉత్సవం’ ఓటీటీలోకి వచ్చింది. దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, నాజర్, బ్రహ్మానందం, ఆలీ, ప్రేమ, ఎల్బీ శ్రీరామ్, అనీష్ కురువిల్లా, ప్రియదర్శి, ఆమని, సుధా వంటి భారీ తారాగణంతో సురేష్ పాటిల్ నిర్మించిన ఈ చిత్రానికి అర్జున్ సాయి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం గత నెలలో థియేటర్లలోకి వచ్చి మంచి స్పందనను రాబట్టుకుంది. ఇప్పుడు ఓటీటీలోనూ మంచి ఆదరణను రాబట్టుకుంటోంది.

Also Read- Nara Family Marriage: నారా రోహిత్, సిరిల నిశ్చితార్థం ఎప్పుడు, ఎక్కడంటే?

అంతరించి పోతోన్న నాటక రంగం గురించి, వాటితో ముడిపడి ఉన్న ఎమోషన్స్‌ను, నేటి ట్రెండ్‌కు తగినట్లుగా, చక్కని కథనంతో చూపించారు. ఎమోషనల్, యూత్ ఫుల్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా విమర్శకులను సైతం మెప్పించింది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. దసరా సందర్భంగా అక్టోబర్ 11న ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చింది. బిగ్ ఫిష్ సినిమాస్ ద్వారా ఈ మూవీ ఓటీటీలో విడుదలై అందరినీ ఆకట్టుకుంటోంది.


రసూల్‌ ఎల్లోర్‌ సినిమాటోగ్రఫీ, అనూప్‌ రూబెన్స్‌ సంగీతం ‘ఉత్సవం’ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సరికొత్త కంటెంట్‌ను ఇష్టపడే వారిని ఈ సినిమా అద్భుతంగా ఎంటర్‌టైన్ చేస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ప్రస్తుతం ఓటీటీలో ఈ సినిమాకు వస్తున్న స్పందనతో వారు కూడా హ్యాపీగా ఉన్నారు.

Also Read- Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' టీజర్.. ఎగిరే గుర్రంపై చిరు

Also Read- Maa Nanna Superhero Review: సుధీర్‌బాబు నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఎలా ఉందంటే..

Also Read- Vettaiyan Review: రజనీకాంత్ నటించిన యాక్షన్ మూవీ ‘వేట్ట‌య‌న్... ది హంట‌ర్‌’ ఎలా ఉందంటే.. 

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 13 , 2024 | 12:11 AM