Bhargavi Nilayam OTT: ఓటీటీకి తెలుగులో.. వచ్చేసిన మలయాళ హర్రర్ డ్రామా
ABN, Publish Date - Sep 05 , 2024 | 03:16 PM
డిజిటల్ ప్రేక్షకులను అలరించడానికి ఈ వారం ఓ మలయాళ హర్రర్ చిత్రం వచ్చేసింది. 2023లో వచ్చిన నీలవెలిచం అనే మలయాళం సినిమాను భార్గవినిలయంగా అనువాదం చేసి ఓటీటీ స్ట్రీమింగ్‌కు తీసుకువచ్చారు.
డిజిటల్ ప్రేక్షకులను అలరించడానికి ఈ వారం ఓ మలయాళ హర్రర్ చిత్రం వచ్చేసింది. అప్పుడెప్పుడో 1964లో మలయాళంలో వచ్చిన భార్గవినిలయం (Bhargavi Nilayam) సినిమాను తిరిగి 2023లో నీలవెలిచం (Neelavelicham) పేరుతో అక్కడక్కడ కొన్ని మార్పులు చేసి రిమేక్ చేసి 2023 ఏప్రిల్ విడుదల చేశారు. ఇప్పుడు ఆ సినిమాను తెలుగులో భార్గవినిలయం (Bhargavi Nilayam)గా అనువాదం చేసి ఓటీటీలో రిలీజ్ చేశారు. ఈ మూవీలో స్టార్ హీరో టోవినో థామస్, రిమా, రోషన్ మాథ్యూ, షైన్ టామ్ చాకో ప్రధాన పాత్రల్లో నటించారు. అశిక్ అబు దర్శకత్వం వహించాడు.
కథ విషయానికి వస్తే.. భార్గవి నిలయం ఓ పాతబడిన బంగ్లా ఉంటుంది. అక్కడ ఓ దయ్యం తిరుగుతూ ఉందని అక్కడికి ఎవరూ వెళ్లే సాహాసం చేయరు. అయితే ఆ బంగ్లాను ఓ పేరున్న రచయిత కొనుగోలు చేసి మకాం అక్కడికి మారుస్తాడు. ఆపై బంగ్లాలో ఉన్న దయ్యం, దాని హిస్టరీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటాడు. అదే సమయంలో దయ్యం కొన్ని హింట్లు ఇస్తూ ఉంటుంది. చివరకు భార్గవి మర్డర్ మిస్టరీని రచయిత తెలుసుకున్నాడా అనేదే స్టోరీ.
అయితే 2 గంటల.07 నిమిషాల నిడివితో ఉన్న ఈ సినిమా ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదిలాఉండగా సినిమాలో ఎప్పుడు ఏం జరుగబోతుంది అనే విషయం చూసే వారికి ప్రిడక్టిబుల్‌గా అనిపిస్తూ ఉంటుంది. అసలు విలన్‌ను ముందే తెలిసిపోవడంతో సినిమాపై చివరి వరకు ఇంట్రెస్ట్ క్రియేట్ చేయదు. మలయాళ సినిమాలు, టోవినో థామస్ సినిమాలు ఇష్టపడే వారు ఈ భార్గవినిలయం (Bhargavi Nilayam) సినిమాను ఒక్కసారి చూసేయవచ్చు.