Atharva: ఒక్క సినిమా రెండు ఓటీటీల్లో.. ఆకట్టుకుంటున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘అథర్వ’
ABN, Publish Date - Jan 26 , 2024 | 03:14 PM
కార్తీక్ రాజు, సిమ్రన్ చౌదరి జంటగా గత నెలలో థియేటర్లలో విడుదలై విజయం సాధించిన క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ చిత్రం ‘అథర్వ’. మహేష్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా కల్పిక గణేశ్, కబీర్ దుల్హన్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
కార్తీక్ రాజు, (karthik raju) సిమ్రన్ చౌదరి (Simran) జంటగా గత నెలలో థియేటర్లలో విడుదలై విజయం సాధించిన క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ చిత్రం ‘అథర్వ’ (Atharva). మహేష్ రెడ్డి (mahesh reddy) ఈ సినిమాకు దర్శకత్వం వహించగా నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సుభాష్ నూతలపాటి నిర్మించారు. కల్పిక గణేశ్, కబీర్ దుల్హన్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీచరణ్ పాకాల (Sricharan Pakala) సంగీతం అందించారు. డిసెంబర్ 1న రిలీజైన ఈ సినిమా మంచి చిత్రంగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
మనం ఇంతవరకు ఇలాంటివి ఎన్నో క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్లను చూసి ఉనప్పటికీ ఈ చిత్రం ప్రేక్షకులను కొత్త అనుభూతిని కలుగజేస్తుంది. ఓ క్రైమ్ సీన్‌లో క్లూస్ టీం ప్రాముఖ్యత ఎలా ఉంటుంది, ఒక క్రిమినల్‌ను పట్టుకొనేందుకు క్లూస్, ఫొరెన్సిక్ డిపార్ట్‌మెంట్లు పడే కష్టాన్ని సవివరంగా వివరిస్తూ, ఆ టీం పడే కష్టాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు. కథ విషయానికి వస్తే హీరో కర్ణ చాలా కాలం తర్వాత తన స్నేహితురాలు నిత్యను అనుకోకుండా కలిసి తమకు మ్యూచువల్ ఫ్రెండ్ టాప్ హీరోయిన్ అయిన జ్యోత్స్ని ఇంటికి వెళతారు. వాళ్లు అక్కడికి వెళ్లే సరికి జ్యోత్స్నితో పాటు,ఆమె భర్త శివ చనిపోయి కనిపిస్తారు. కేసును ఇన్వెస్టిగెషన్ చేస్తున్న పోలీసులు ఎలాంటి అధారాలు దొరకకపోవడంతో శివనే తన భార్యను చంపి తను ఆత్మహత్య చేసుకున్నాడన్నట్లుగా పేర్కొంటు కేసునుక్లోజ్ చేస్తారు.
అయితే చనిపోయిన వారి బంధం గురించి పూర్తిగా తెలిసిన హీరో కర్ణ ఎలాంటి ఆనవాళ్లు, క్లూ కూడా లేని కేసును పరిష్కరించేందుకు రంగంలో దిగుతాడు. ఎక్కడికక్కడ డెడ్ ఎండ్ అనిపించినా, క్లూ దొరక పోవడం చూసే వారిని కూడా ఆలోచించేలా చేస్తుంది. ఈ క్రమంలో కర్ణ కేసును ఎలా చేధించాడు, ఎవరు హంతకులను ఎలా గుర్తించాడనే అంశంతో చాలా ఆసక్తికరంగా సినిమా సాగుతుంది, ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు అదిరిపోతుంటాయి. అదేవిధంగా సినిమా ఇండస్ట్రీలో జరిగే దారుణాలను కూడా లైట్‌గా టచ్ చేశారు, ఇలాంటివి కూడా జరగొచ్చని చూయిచాడు. అయితే గంట 56 నిమిషాల నిడివితో ఉండే ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాగా ఈ టీవీ విన్ మరియు అమోజాన్ ప్రైమ్ వీడియో(PrimeVideoIN)లో స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ చిత్రాన్ని పలువురు పోరెన్సిక్ నిపుణులు తిలకించి అభినందనలు కూడా తెలిపారు.