OTT: రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి.. నిషేధిత, కాంట్రవర్సీ బాలీవుడ్ చిత్రం
ABN, Publish Date - Feb 06 , 2024 | 07:35 PM
రెండు సంవత్సరాల క్రితం దేశాన్ని ఓ ఊపు ఊపిన చిత్రం‘ది కేరళ స్టోరీ’. థియేటర్లలో రిలీజైన దాదాపు 23 నెలల తర్వాత ఇన్నాళ్లకు డిజిటల్ స్ట్రీమింగ్ మోక్షం లభించింది.
రెండు సంవత్సరాల క్రితం దేశాన్ని ఓ ఊపు ఊపిన చిత్రం‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story). మార్చి 11 2022న దేశవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఇన్నాళ్లకు డిజిటల్ స్ట్రీమింగ్ మోక్షం లభించింది. రాజకీయంగా తీ చాలా రాష్ట్రాల నుంచి, మతాల నుంచి తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్న ఈ చిత్రం మన దేశంలో కిన్ని రాష్ట్రాలలో, బయట కొన్ని దేశాలలో నిషేధం విధించారంటే ఈ సినిమా ఎలాంటి పరిస్థితి క్రియేట్ చేసిందో అర్ధం చేసుకోవచ్చు.
ఈ సినిమా అంత హడావుడి చేసి, అంత వ్యతిరేఖతను మూటగట్టుకున్నప్పటికీ వసూళ్ల పరంగా బాలీవుడ్‌లో రికార్డులు నెలకొల్పింది. కేవలం రూ.25 కోట్ల లోపు బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.350 కోట్లు రాబట్టి సంచలనం సృష్టించింది. ఆదాశర్మ (Adah Sharma) లీడ్ రీల్‌లో నటించగా కేరళలో యధార్థంగా జరిగిన మహిళల అదృశ్యం నేపథ్యంలో తెరకెక్కించారు. కొంతమంది యువతులు మతం మారడం తర్వాత ప్రత్యేక శిక్షణ తీసుకుని ఉగ్రవాదులుగా మారడం ఇతివృత్తంలో సినిమా సాగుతుంది. అదృశ్యమైన యువతుల్లో చాలా మందిని కావాలని మతం మార్పించారని, బలవంతంగా ఐసీస్ శిక్షణ ఇప్పించారనే కోణంలో సినిమా ఉండడంతో చిత్రంపై వ్యతికేత తీవ్ర స్థాయిలో వచ్చింది.
అయితే సినిమా రిలీజైన దాదాపు 23 నెలల తర్వాత ఈ ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story) సినిమా ఫిబ్రవరి 16 (Feb 16th) నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫాం జీ5 (Zee5)లో స్ట్రీమింగ్ కానుంది. అయితే థియేటర్లో విడుదల చేసిన వెర్షన్ కాకుండా కొన్ని వివాదాస్పద సన్నివేశాలను తొలగించి విడుదల చయనున్నారు.
ఇదిలాఉండగా ఈ మధ్యే నయనతార అన్నపూర్ణి చిత్రం విషయంలో తీవ్ర వ్యతిరేఖత రావడంతో సినిమాను ఓటీటీ నుంచి తొలగించిన నేపథ్యం ఉండడంతో మరి ఈ సినిమా విషయంలో అది పునరావృతం ఏమైనా అవుతందా అనే కొన్ని రోజులు ఆగితే తప్పా తెలియదు.