OTT: మ‌రో ఓటీటీలోకి వ‌చ్చేసిన.. ‘స‌త్య‌భామ‌, డియ‌ర్ నాన్న’

ABN, Publish Date - Aug 02 , 2024 | 02:07 PM

ఈమ‌ధ్య కొన్ని సినిమాలు రెండు మూడు ఫ్లాట్‌ఫాంల‌లోకి వ‌చ్చి స‌ర్‌ఫ్రైజ్ చేస్తున్నాయి. తాజాగా కాజ‌ల్ ఆగ‌ర్వాల్ న‌టించిన స‌త్య‌భామ, చైతన్య రావు డియ‌ర్ నాన్న చిత్రాలు ఇప్పుడు మ‌రో ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వ‌చ్చేశాయి.

ott movies

థియేట‌ర్ల‌లో అల‌రించిన సినిమాలు చాలా వేగంగా ఓటీటీలోకి వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు కొన్ని సినిమాలు ఒక‌టి కాదు రెండు మూడు ఫ్లాట్‌ఫాంల‌లోకి వ‌చ్చి స‌ర్‌ఫ్రైజ్ చేస్తున్నాయి. ఈక్ర‌మంలో తాజాగా మ‌రో రెండు సినిమాలు ఈ కోవ‌లోకి వ‌చ్చాయి. రెండు నెల‌ల క్రితం థియేట‌ర్ల‌లో విడుద‌లై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న కాజ‌ల్ ఆగ‌ర్వాల్ (Kajal Aggarwal) న‌టించిన స‌త్య‌భామ (Satyabhama), డైరెక్ట్ డిజిటల్‌లో విడుద‌లైన డియ‌ర్ నాన్న (Dear Nanna) చిత్రాలు ఇప్పుడు ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వ‌చ్చేశాయి.

స‌త్య‌భామ సినిమాలో కాజ‌ల్ అగ‌ర్వాల్ మెయిన్‌లీడ్‌గా న‌టించ‌గా నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్థన్ కీలక పాత్రల్లో నటించారు. ’ కథ విషయానికి వస్తే.. ఓ హత్యకేసులో ఎమోషనల్ అయిన సత్యభామ ఆ కేసును ఛాలెంజ్‌గా తీసుకుని ఎలా సాల్వ్ చేసింది, ఎటాంటి చిక్కుముడులు వ‌చ్చాయి అనేది ఈ సినిమాలో ఆస‌క్తిక‌రంగా చివ‌రి వ‌ర‌కు మంచి స‌స్పెన్స్ తో చూయించారు. ప్ర‌స్తుతం ఈ మూవీ అమెజాన్‌లో (Kajal Aggarwal) రికార్డు వ్యూస్ ద‌క్కించుకోగా ఇప్పుడు ఈటీవీ విన్ ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది.


ఇక చైతన్య రావ్ (Chaitanya Rao), యష్ణ చౌదరి (Yashna Chowdary), సూర్య కుమార్ భగవాన్ దాస్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించిన చిత్రం 'డియర్ నాన్న. ఇప్ప‌టికే ఈ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండ‌గా తాజాగా ఇప్పుడు ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. కరోనా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ చిత్రం ఇప్పటికే అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో సత్తా చాటింది. హ్యూస్టన్ ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024 డియర్ నాన్న (Dear Nanna) రెమి అవార్డు విజేతగా నిలిచింది.

చెఫ్ కావాలని కలులు కనే చైతన్య రావ్ తన జీవితంలో ఎదురైన సంఘటనలు, తనలో కలిగిన మార్పుని, కరోనా సమయంలో మెడికల్ షాపుల ప్రాధాన్యత, వారు చేసిన త్యాగాలని అద్భుతంగా చూపించారు. ఫాదర్ ఎమోషన్ సన్ ఎమోషన్ లో ఇందులో మరో హైలెట్. చైతన్య రావ్, సూర్య కుమార్ భగవాన్ దాస్ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులని అలరిస్తాయి.

Updated Date - Aug 02 , 2024 | 03:26 PM