Radhaa MadhavamOTT: అమెజాన్ ప్రైమ్ లో.. దూసుకుపోతున్న ‘రాధా మాధవం’

ABN, Publish Date - Jul 25 , 2024 | 02:12 PM

పరువు హత్యల నేపథ్యంలో గతంలో చాలా సినిమాలు వచ్చి మెప్పించాయి, అలాంటి ఒక కంటెంట్ తో వచ్చిన సినిమానే 'రాధా మాధవం'. గ్రామీణ నేపథ్యంలో నడిచే ఈ సినిమా ప్రస్తుతం 'అమెజాన్ ప్రైమ్'లో మంచి ఆదరణను దక్కించుకుంటోంది.

RADHA MADAVAM

పరువు హత్యల నేపథ్యంలో గతంలో చాలా సినిమాలు వచ్చి మెప్పించాయి, అలాంటి ఒక కంటెంట్ తో వచ్చిన సినిమానే 'రాధా మాధవం' (Radha Madhavam). గోనాల వెంకటేశ్ నిర్మించిన ఈ సినిమాకి, దాసరి ఇసాక్ ( ESHAKU DASARI) దర్శకత్వం వహించాడు. గ్రామీణ నేపథ్యంలో నడిచే ఈ సినిమా ప్రస్తుతం 'అమెజాన్ ప్రైమ్'లో మంచి ఆదరణను దక్కించుకుంటోంది. ప్రస్తుతం టాప్ ట్రెండింగ్ లో నిలిచింది.

ఈ మధ్య విలేజ్ లవ్ స్టోరీలు ఎక్కువగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇలాంటి విలేజ్ లవ్ స్టోరీనే రాధా మాధవం కూడా. ఈ చిత్రంలో వినాయక్ దేశాయ్ (Vinayak Desai), అపర్ణ దేవి (Aparna deviii)హీరో హీరోయిన్లుగా నటించగా గోనాల్ వెంకటేష్ (Gonal Venkatesh) నిర్మించారు. వసంత్ వెంకట్ బాలా (Vasanth Venkat bala) కథ, మాటలు, పాటలు అందించారు.


పరువు హత్యలు, పట్టింపులు, ప్రేమలు, ఆప్యాయతలు, పల్లెటూరు వాతావరణం వంటి అంశాలను పిరియాడిక్ స్టైల్ లో ఎక్కడా అశ్లీలత లేకుండా తెరకెక్కించారు. కథాకథనాలలో కొత్తదనంతో దర్శకుడు సినిమాను నడిపిన విధానం బాగుంది. దాదాపు అంతా నూతన నటీనటులతో రూపొందించిన ఈ సినిమాను కుటుంబం మొత్తం కలిసి చూడొచ్చు.

Updated Date - Jul 25 , 2024 | 02:12 PM