Teenagers 17by18: ఓటీటీలో ‘టీనేజర్స్ 17by18’ దూసుకెళుతోంది
ABN, Publish Date - Sep 21 , 2024 | 09:16 PM
కన్నడలో వచ్చిన ‘హడినెలెంటు’కి డబ్బింగ్ వెర్షన్‌గా ‘టీనేజర్స్ 17by18’ అనే చిత్రం ఆహాలో తెలుగు ఆడియెన్స్‌కి అందుబాటులోకి వచ్చింది. యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే అనేక అవార్డులను సొంతం చేసుకున్న ఈ సినిమా.. ఆహాలోనూ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.
కన్నడలో వచ్చిన ‘హడినెలెంటు’కి డబ్బింగ్ వెర్షన్‌గా ‘టీనేజర్స్ 17by18’ అనే చిత్రం ఆహాలో తెలుగు ఆడియెన్స్‌కి అందుబాటులోకి వచ్చింది. యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఓ మంచి మెసేజ్‌తో మేకర్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ముఖ్యంగా యూత్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను ఇందులో చూపించారు. ఈ చిత్రానికి అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులు రావడం విశేషం. హనుమాన్ మీడియాపై నిర్మాత బాలు చరణ్ ఈ మూవీని ఆహాలోకి అందుబాటులోకి తీసుకొచ్చారు. సెప్టెంబర్ 21 నుంచి ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్‌కి వచ్చేసింది.
Also Read- Devara: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఫ్యాన్స్‌కి పండగే!
మెల్ బోర్న్ ఫిల్మ్ ఫెస్టివల్, న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్, ఒట్టావా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇలా అనేక జాతీయ, అంతర్జాతీయ వేదికల్లో టీనేజర్స్ చిత్రం అందరినీ ఆకట్టుకుని అవార్డులను సాధించింది. పృథ్వీ కొననూర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా నిర్మించారు. ఇక ఈ చిత్రంలో షెర్లిన్ బోస్లే, నీరజ్ మాథ్యూ, రేఖా కుడ్లిగి, సుధా బెలావుడి, భవానీ ప్రకాష్ వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. ఆహాలో ఈ చిత్రం మంచి ఆదరణను రాబట్టుకుంటోంది. అర్థరాత్రి ఆహాలో స్ట్రీమింగ్‌కి వచ్చిన ఈ చిత్రం అప్పుడే మిలియన్ల మినిట్ వ్యూస్‌తో దూసుకుపోతోంది. అలాగే ఆహాలో ఈ సినిమా టాప్ 4 లోకి వచ్చేసింది. స్ట్రీమింగ్‌కు వచ్చిన 12 గంటల్లో 15 మిలియన్ మినిట్ వ్యూస్‌తో ఆహాలో ఈ సినిమా ట్రెండ్ అవుతోంది.
Also Read- Tirupati Controversy: లడ్డూ వివాదంపై పవన్ కళ్యాణ్‌కు ప్రకాశ్ రాజ్ కౌంటర్
Also Read- ANR100: ఏఎన్నార్‌ను స్మరించుకున్న చిరు, బాలయ్య
Also Read- Jani Master: నేరాన్ని అంగీకరించిన జానీ మాస్టర్.. రిమాండ్ రిపోర్ట్ ఇదే
Read Latest Cinema News