Chutney Sambar: యోగిబాబు హీరోగా వెబ్‌సిరీస్ ‘చట్నీ సాంబార్’

ABN, Publish Date - Jun 24 , 2024 | 03:17 PM

త‌మిళ‌నాట క‌మెడియ‌న్ యోగిబాబు హ‌వా అంత‌కుమించి అనే రేంజ్‌లో దూసుకుపోతుంది. తాజాగా ఆయ‌న మెయిన్‌లీడ్‌గా న‌టించిన‌ వెబ్ సిరీస్ ‘చట్నీ సాంబార్’ డిజిట‌ల్ స్రీమింగ్‌కు రెడీ అవుతోంది.

yogibabu

త‌మిళ‌నాట క‌మెడియ‌న్ యోగిబాబు (Yogi Babu) హ‌వా అంత‌కుమించి అనే రేంజ్‌లో దూసుకుపోతుంది. ఆయ‌న క‌మెడియ‌న్ పాత్ర‌ల‌తో చేతినిండా చిత్రాల‌తో బిజీగా ఉండ‌గా కొన్ని సినిమాల్లో హీరోగా కూడా వ‌రుసగా సినిమాలు చేస్తూ త‌న స‌త్తా చాటుతున్నాడు. తాజాగా ఆయ‌న మెయిన్‌లీడ్‌గా న‌టించిన‌ వెబ్ సిరీస్ ‘చట్నీ సాంబార్’ (Chutney Sambar) డిజిట‌ల్ స్రీమింగ్‌కు రెడీ అవుతోంది. తాజాగా ఈ సిరీస్‌కు సంబంధించి ఫ‌స్ట్ లుక్‌ను డిస్నీ హాట్‌స్టార్ (Disneyplus Hotstar) విడుద‌ల చేసింది.

యోగిబాబు స‌ర‌స‌న‌ వాణి భోజన్ (Vani Bhojan) క‌థానాయిక‌గా న‌టిస్తోండ‌గా, కయల్‌ చంద్రన్‌, నితిన్‌ సత్య, దీపా శంకర్‌, సంయుక్త విశ్వనాథ్‌, సుందర్‌ రాజన్ ప్ర‌ధాన పాత్రలను పోషించారు. గతంలో ప్ర‌కాశ‌రాజ్‌తో ఆకాశ‌మంతా, గౌర‌వం, నాగార్జున‌తో గ‌గ‌నం వంటి సినిమాల‌ను తెర‌కెక్కించిన‌ రాధా మోహ‌న్ (Radha Mohan) ఈ సిరీస్‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం విశేషం.


ఇటీవ‌లే పీటీ స‌ర్ చిత్రంలో సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన‌ ప్ర‌ముఖ త‌మిళ‌నాడులోని వేల్స్ అకాడ‌మీ (Vels Film International) ఈ ‘చట్నీ సాంబార్’ (Chutney Sambar) సిరీస్‌ను నిర్మించింది. హాయిగా సాగిపోయే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన వెబ్ సిరీస్ విడుద‌ల తేదీని మేక‌ర్స్ త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నున్నారు.

Updated Date - Jun 24 , 2024 | 04:44 PM