DBlock OTT: ఓటీటీలో.. అదరగొడుతున్న సస్పెన్స్ థ్రిల్లర్
ABN, Publish Date - Aug 11 , 2024 | 12:27 PM
తాజాగా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం డీ బ్లాక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. అరుళ్‌నిధి, అవంతిక మిశ్రా జంటగా నటించిన ఈ చిత్రం మంచి వ్యూస్ దక్కించుకుంటోంది.
తాజాగా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చిన థ్రిల్లర్ చిత్రం డీ బ్లాక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. అరుళ్‌నిధి (Arulnithi), అవంతిక మిశ్రా (Avantika Mishra) జంటగా నటించిన ఈ చిత్రం 2022లో తమిళనాట విడుదలై మంచి విజయం సాధించింది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల కోసం డబ్బింగ్ చేసి ఓటీటీలోకి తీసుకు వచ్చారు. విజయ్ కుమార్ రాజేంద్రన్ (Vijay Kumar Rajendran) ఈ సినిమాకు దర్శకత్వం వహించగా సినిమాటోగ్రాఫర్ అరవింద్ సింగ్ (Aravinnd Singh) నిర్మించారు. తెలుగు నటుడు చరణ్‌దీప్ (Charandeep) కు మంచి క్యారెక్టర్ పడింది.
కథ విషయానికి వస్తే.. అరుల్ సిటీకి దూరంగా ఉన్న ఓ ఇంజినీరింగ్ కాలేజీలో జాయిన్ అయి ఆ కాలేజీ హాస్టల్లో ఉంటూ మిత్రులతో జాలీగా ఉంటుంటాడు. శృతితో ప్రేమలో పడతాడు. అయితే అ అడవిలో బాయ్స్ హస్టల్‌కు కాస్త దూరంగా గర్ట్స్ హస్టల్ డీ బ్లాక్ ఉంటుంది. అయితే ఓ రోజు లేడీస్ హస్టల్‌లో అరుల్ క్లాస్ లీడర్ స్వాతి ఏదో ఆకారాన్ని గుర్తించి తోటి వారికి చెబుతుంది కానీ ఎవరు అంతగా పట్టించుకోరు. ఈ తర్వాత తెల్లారి స్వాతి చిరుత దాడిలో చనిపోయి కనిపిస్తుంది.
అయితే అదే సమయంలో ఓ యువతి అరుల్ దగ్గరికి వచ్చి ఓ డ్రాయింగ్ చూపి స్వాతిని చిరుత చంపలేదని చెబుతుంది. ఈ విషయాన్ని కాలేజీ దృష్టికి తీసుకుపోయినా పట్టించుకోరు. దీంతో అరుల్ ఈ హత్యల వెనక ఎవరు ఉన్నారనే విషయాన్ని తెలుసుకునేందుకు రంగంలోకి దిగుతాడు. ఈ నేపథ్యంలో ఈ హత్యలు కొత్తగా జరగడం లేదని గత పది సంవత్సరాలుగా జరుగుతున్నట్లు తెలుసుకుని షాకవుతారు. ఆపై అరుల్ హంతకుడిని పట్టుకున్నాడా లేదా, అసలు హత్యలు ఎందుకు జరిగాయి, చివరికి ఎలాంటి ముగింపు ఇచ్చారనే ఇంట్రెస్టింగ్ కథకథనాలతో సినిమా అద్యంతం అలరిస్తుంది.
ముఖ్యంగా సినిమాలో పాయింట్ సింఫుల్ అయినప్పటికీ చివరి వరకు సస్పెన్స్‌ను మంచిగా నడిపించారు. ఎక్కడా ఓవర్‌యాక్షన్స్, ఎలివేషన్స్ లేకుండా హీరోను సాధారణ కాలేజీ కుర్రాడిగా చూయించిన విధానం బావుంది, ప్రధానంగా క్లైమాక్స్‌లో హీరోకు బిల్డప్ ఇవ్వకుండా చేసిన ఫైట్ సీన్స్ వున్నాయి. అక్కడక్కడ అమ్మాల అందం గురించి కమెడియన్ వన్ లైనర్స్ ఎక్సలెంట్‌గా కుదిరాయి. ప్రస్తుతం ఈ సినిమా ఈ టీవీ విన్ (ETV Win) యాప్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కుటుంబ సమేతంగా హాయిగా చూసి ఎంజాయ్ చేయవచ్చు.