Demonte Colony 2: ఓటీటీకి వచ్చేస్తున్న సీట్ ఎడ్జ్ థ్రిల్లర్.. ధైర్యం ఉంటేనే చూడండి
ABN, Publish Date - Sep 16 , 2024 | 09:00 PM
ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తూ, భయపెట్టేందుకు ఓ డిఫరెంట్ చిత్రం ‘డీమాంటే కాలనీ 2’ రెడీ అయింది. ఇటీవలే థియేటర్లలోకి వచ్చి మంచి విజయం సాధించిన ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్‌కు మరి కొద్ది రోజులే సమయం ఉంది.
ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తూ, భయపెట్టేందుకు ఓ డిఫరెంట్ చిత్రం ‘డీమాంటే కాలనీ 2’ (Demonte Colony 2)రెడీ అయింది. ఇటీవలే థియేటర్లలోకి వచ్చి మంచి విజయం సాధించిన ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్‌కు మరి కొద్ది రోజులే సమయం ఉంది. 2015లో వచ్చి సంచలన విజయం సాధించిన డిమాంటే కాలనీకి సీక్వెల్‌గా వచ్చిన ఈ ‘డీమాంటే కాలనీ 2’ సినిమా రూ.55 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి రికార్డు సృష్టించింది. మొదటి చిత్రాన్ని డైరెక్ట్ చేసిన జ్ఞానముత్తు (Ajay R Gnanamuthu) ఈ మూవీకి దర్శకత్వం వహించగా అరుల్‌నిధి (Arulnithi), ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar), అరుణ్ పాండ్యన్ కీలక పాత్రల్లో నటించారు.
కథ విషయానికి వస్తే.. క్యాన్సర్ బారిన పడిన భర్త సామ్ రిచర్డ్ (సర్జనో ఖాలిద్)ను, అతని భార్య డెబీ (ప్రియా భవానీ శంకర్) ఎన్నో ప్రయాసలకోర్చి క్యాన్సర్ నుంచి కోలుకునేలా చేస్తుంది. అయితే అంతా బాగుందనుకునే టైంలో ఆత్మహత్య చేసుకుంటాడు. తన భర్త ఎందుకు చనిపోయాడనేది అంతుబట్టక.. అతని ఆత్మతో మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తుంది డెబీ. ఈ క్రమంలో తన భర్త చావుకి ఓ బుక్ చదవడమే కారణమని తెలుసుకుంటుంది. ఆ బుక్ ఆరేళ్లకు ఒకసారి కొంతమందిని చంపేస్తుందనే విషయం తెలుసుకున్న డెబీ.. అప్పటికే ఆ బుక్ చదివి ఉన్న కవల సోదరులు శ్రీనివాస్, రఘునందన్ (అరుళ్ నిధి)లను కాపాడాలనుకుంటుంది. ఇందుకోసం ఆమె.. తన మామ రిచర్డ్ (అరుణ్ పాండియన్), ఆత్మలతో మాట్లాడించే టిబెట్ బౌద్ద గురువు సాయం తీసుకుంటుంది.
ఈ నేపథ్యంలో సినిమా మొదటి పార్ట్ ‘డిమోంటి కాలనీ’లో జరిగిన సన్నివేశాలతో లింక్ అవుతూ సరికొత్త విషయాలు బయటకు వస్తాయి. మనుషులను చంపేస్తున్న బుక్‌కి ఉన్న సంబంధం ఏమిటి? కవల సోదరులను డెబీ రక్షించగలిగిందా? అసలు డెబీ.. ఈ విషయాలన్నీ ఎలా తెలుసుకుంది? అనే ఆసక్తికరమైన కథకథనాలతో సినిమా సాగుతూ ప్రతి ఫ్రేమ్ చూసే వారిని భయపెడుతూ, వరుస ట్విస్టులతో సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతుంది. అయితే ఫస్ట్ పార్ట్ చూసిన వారికి ఈ సినిమా కన్ఫ్యూజ్ లేకుండా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ సినిమా సెప్టెంబర్ 27 నుంచి జీ5 ( ZEE5) ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. సినిమాలో ఎలాంటి అసభ్య , అశ్లీల సన్నివేశాలు లేవు . కుటుంబ సభ్యలంతా కలిసి చూడవచ్చు కానీ ఎక్కువగా భయ పడే వారు మాత్రం ఈ సినిమా చూడకపోవడం బెటర్.