Gorre Puranam OTT: సుహాస్ ‘గొర్రె పురాణం’కు ఓటీటీలో అదిరిపోయే రెస్పాన్స్
ABN, Publish Date - Oct 11 , 2024 | 07:51 PM
డిఫరెంట్ జోనర్స్, కంటెంట్ బేస్డ్ సినిమాలతో అదరగొడుతున్న ‘ఆహా’ ఓటీటీలో మరో ఇంట్రస్టింగ్ మూవీ చేరింది. హీరో సుహాస్ లేటెస్ట్ కంటెంట్ ప్యాక్డ్ మూవీ ‘గొర్రె పురాణం’ ఆహాలో మంచి స్పందనను రాబట్టుకుంటోంది. అసలీ సినిమా కథేంటంటే..
డిఫరెంట్ జోనర్స్, కంటెంట్ బేస్డ్ సినిమాలతో అదరగొడుతున్న ‘ఆహా’ ఓటీటీ (Aha OTT)లో మరో ఇంట్రస్టింగ్ మూవీ చేరింది. హీరో సుహాస్ లేటెస్ట్ కంటెంట్ ప్యాక్డ్ మూవీ ‘గొర్రె పురాణం’ (Gorre Puranam) అక్టోబర్ 10 నుండి ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. యూనిక్ స్టొరీ, సుహాస్ (Suhas) ఎక్స్ ట్రార్డినరీ పెర్ఫార్మెన్స్‌తో వచ్చిన ఈ సినిమా ఓటీటీలో మంచి ఆదరణను పొందుతోంది. ఈ సినిమా భవానీ మీడియా ద్వారా ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో ‘జనక అయితే గనక’ సినిమాతోనూ, ఓటీటీలో ఈ ‘గొర్రె పురాణం’ సినిమాతోనూ సుహాస్ పేరు బాగా ట్రెండ్ అవుతోంది. చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడా లేకుండా కంటెంట్ ఉంటే చాలు మేము ప్రోత్సాహం అందిస్తామంటున్న తెలుగు ఆడియన్స్‌కి వీకెండ్, దసరా పండగ కలిసి రావడంతో ‘గొర్రె పురాణం’ మస్ట్ వాచ్ సినిమా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
Also Read- Janaka Aithe Ganaka Review: ‘జనక అయితే గనక’ మూవీ ప్రీ రిలీజ్ రివ్యూ
‘గొర్రె పురాణం’ మూవీ కథ విషయానికి వస్తే (Gorre Puranam Story).. హిందూ ముస్లింల మధ్య మత ఘర్షణలు సృష్టించిందని ఏసు అని పిలవబడే గొర్రెను జైల్లో వేస్తారు. సరిగ్గా అదే సమయంలో అదే జైల్లో ఓ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న రవి (సుహాస్) ఆ గొర్రెకు కాపరిగా వ్యవహరిస్తుంటాడు. ఇంతకు గొర్రె వల్ల మత కల్లోలాలు ఎందుకు చెలరేగాయి? అంతవరకు రాముగా ఉన్న గొర్రె ఏసుగా ఎందుకు మారింది, రవి జైల్లో ఎందుకు ఉన్నాడు? అతని స్టోరీ ఏంటి? వంటి ప్రశ్నలకు సమాధానమే ‘గొర్రె పురాణం’ చిత్రం. సమాజం, మీడియా, కోర్టులు, ప్రభుత్వాలు వంటి అంశాలు, వాటి పని తీరుపై వ్యంగ్యంగా ఈ సినిమాను రూపొందించారు. చిత్రంలో గొర్రెకి దర్శకుడు నటుడు తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం.
మంచి మెసేజ్ ఉన్న కథతో, ఆకట్టుకునే కథనంతో బాబీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాను ఫోకల్ వెంచర్స్ పతాకంపై ప్రవీణ్ రెడ్డి నిర్మించగా.. ‘లవ్‌స్టోరి’ సినిమాకు సంగీతం అందించిన పవన్ సి హెచ్ (Pawan CH) ఈ సినిమాకు సంగీతం అదించారు. అక్టోబర్ 10 (గురువారం) నుంచి భవానీ మీడియా ద్వారా ఆహాలోకి వచ్చిన ఈ సినిమాను థియేటర్లలో మిస్సయిన వారు ఇప్పుడు ఇంట్లోనే కుంటుంబంతో కలిసి చూసేయవచ్చు.