Balu Gani Talkies OTT: టాప్ 2లో ట్రెండ్ అవుతోన్న ‘బాలు గాని టాకీస్’
ABN, Publish Date - Oct 13 , 2024 | 02:57 PM
విలేజ్ రివేంజ్, ఎమోషనల్ డ్రామాగా ఎంతో నేచురల్‌గా తెరకెక్కిన ‘బాలు గాని టాకీస్’ ఓటీటీలో టాప్ 2లో ట్రెండ్ అవుతోంది. డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ వీక్షకుల నుండి మంచి ఆదరణను రాబట్టుకుంటోంది. విషయంలోకి వెళితే..
యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్ చేసి.. వాటి ద్వారా తమ సత్తాను చాటి.. సిల్వర్ స్క్రీన్ వైపు దారిపట్టిన వారంతో మంది నేడు ఇండస్ట్రీలో ఉన్నారు. వాళ్లలో చాలా మంది సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్నారు కూడా. ఇప్పుడు టాలెంట్‌ను ప్రదర్శించేందుకు రకరకాల మాధ్యమాలున్నాయి. ఇండస్ట్రీలోనూ ప్రస్తుతం కొత్త తరం దర్శక నిర్మాతలు, ఆర్టిస్టుల హవా నడుస్తోంది. కాన్సెప్ట్, కంటెంట్ అంటూ చిన్న చిత్రాలతోనే పెద్ద సక్సెస్‌లను అందుకుంటున్నారు. యువ దర్శకులంతా కూడా తమ తమ సత్తాను చాటుకుంటున్నారు. ఈ క్రమంలోనే విశ్వనాథ్ ప్రతాప్ (Vishwanath Prathap) ‘బాలు గాని టాకీస్’ అంటూ తన సత్తా చాటేందుకు వచ్చారు.
Also Read- Devara: ఫ్యాన్స్ కోసమే.. ‘దేవర’ కలెక్షన్స్‌పై నాగ వంశీ సంచలన వ్యాఖ్యలు
శివ, శరణ్య శర్మ, రఘు కుంచె, సుధాకర్ రెడ్డి, వంశీ నెక్కంటి వంటి వారితో విశ్వనాథ్ ప్రతాప్ రూపొందించిన ‘బాలు గాని టాకీస్’ (Balu Gani Talkies) మూవీ.. ఆహా (Aha) డైరెక్ట్ మూవీగా అక్టోబర్ 4న విడుదలై మంచి స్పందనను రాబట్టుకుంటోంది. ఈ మూవీని శ్రీనిధి సాగర్ నిర్మించారు. రూపక్ ప్రణవ్ తేజ్, గుడిమిట్ల శివ ప్రసాద్ ఈ చిత్రానికి సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ప్రస్తుతం ఈ చిత్రం ఆహాలో ట్రెండ్ అవుతోంది. (Aha Original Film)
ఓటీటీలోకి వచ్చే కొత్త కంటెంట్‌ను జనాలు ఎక్కువగా ఆదరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చిన్న సినిమాగా వచ్చిన ‘బాలు గాని టాకీస్’ ఆహాలో టాప్ 2లో ట్రెండ్ అవుతుండటం విశేషం. విలేజ్ రివేంజ్, ఎమోషనల్ డ్రామాగా ఎంతో నేచురల్‌గా తెరకెక్కించిన ఈ చిత్రం ఓటీటీ ఆడియెన్స్ నుండి మంచి ఆదరణను రాబట్టుకుంటోంది. ఈ సినిమాను చూసిన వారంతా దర్శకుడు విశ్వనాథ్ ప్రతాప్ ప్రతిభను మెచ్చుకుంటూ ఉండటం గమనార్హం. ఇంకా ఈ సినిమా చూడని వారు ఎవరైనా ఉంటే.. వెంటనే ఆహాలో చూసేయండి మరి.