Project Z OTT: గ్యాప్‌తో వచ్చినా.. ఓటీటీలో అదరగొడుతున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్
ABN, Publish Date - May 31 , 2024 | 05:19 PM
6 సంవత్సరాల తర్వాత ఇటీవల తెలుగులో థియేటర్లలో విడుదలైన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ప్రాజెక్ట్ z చిత్రం తాజాగా డిజిటల్ స్ట్రీమింగ్ వచ్చి మంచి స్పందనను రాబట్టుకుంటోంది.
ఇటీవల తెలుగులో థియేటర్లలో విడుదలైన ప్రాజెక్ట్ z (Prozect Z) చిత్రం తాజాగా డిజిటల్ స్ట్రీమింగ్ వచ్చి ఇక్కడ మంచి స్పందనను రాబట్టుకుంటోంది. సందీప్ కిషన్ (Sundeep Kishan) , లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) జంటగా జాకీష్రాప్ (Jackie Shroff) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సీవీ కుమార్ (C.V. Kumar) దర్శకత్వం వహించారు.
6 సంవత్సరాల క్రితం షూటింగ్ పూర్తి చేసుకుని ఆర్థిక సమస్యలతో విడుదల కాకుండా ఆగిపోయిన ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ జానర్‌లో రూపొందింది. ఇప్పటికే ఈ చిత్రం మాయవన్ పేరుతో తమిళంలో రిలీజై మంచి విజయం సాధించగా ఆ మధ్య తెలుగులో కొన్ని యూ ట్యూబ్ ఛానల్స్‌లోనూ వచ్చి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇటీవల ఇష్యూలు సద్దుమణగడంతో సినిమాను ఎట్టకేలకు మే రెండో వారంలో థియేటర్లలో విడుదల చేశారు.
టాప్ టెక్నికల్ వ్యాల్యూస్‌తో రూపొందిన ఈ ప్రాజెక్ట్ z (Prozect Z) సినిమా మే 30 నుంచి ఆహా (aha) ఓటీటీ(ott)లో స్ట్రీమింగ్‌కు రాగా మూవీ ఇక్కడి ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్‌ను అందజేస్తోంది. సినిమా ఆద్యంతం ఆసక్తి కలిగించే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఉత్కంఠ గొలిపే సన్నివేశాలు చేసే వారిని సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతున్నాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో టాప్‌లో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.